News November 22, 2024
అదానీ లంచాల వ్యవహారం: స్పందించిన తమిళ సర్కారు

Adani Groupతో తమకు ఎలాంటి ప్రత్యక్ష బంధాలు లేవని తమిళనాడు ప్రభుత్వం స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన SECIతో 2021లో యూనిట్ ₹2.61తో 1,500MW Solar Power 25 ఏళ్లపాటు కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నట్లు మంత్రి సెంథిల్ తెలిపారు. అవినీతిమయమైన గ్రూప్‌ను BJP ఎందుకు సమర్థిస్తోందని DMK ప్రతినిధి శరవణన్ ప్రశ్నించారు. అదానీపై విచారణ జరిపించే దమ్ముందా అని BJPకి సవాల్ విసిరారు.
Similar News
News October 30, 2025
చూడి పశువుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

మిగిలిన పశువుల కంటే చూడి పశువుల విషయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. వీటిని బయటకు వదలకుండా కొట్టం దగ్గరే పరిమితమైన వ్యాయామం కల్పించాలి. శుభ్రమైన మేత, తాగునీరు అందించాలి. కొట్టంలో జారుడునేల లేకుండా చూడాలి. ఇతర పశువులతో పోట్లాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కుక్కలు వీటి వెంటపడి పరిగెత్తించకుండా చూడాలి. కాలువలలో దించడం, వాలుగా ఉన్న ఎత్తయిన గట్లు ఎక్కించడం, ఎక్కువ దూరం నడిపించడం చేయకూడదు.
News October 30, 2025
పెరిగిన బంగారం ధరలు

కొంతకాలంగా రోజులో రెండుసార్లు బంగారం ధరల్లో మార్పులొస్తున్నాయి. HYD బులియన్ మార్కెట్‌లో ఇవాళ <<18146766>>ఉదయం<<>> 24 క్యారెట్ల 10గ్రా.ల బంగారం ధర రూ.1,910 తగ్గగా ఇప్పుడు రూ.990 పెరిగి రూ.1,21,480కు చేరింది. 22 క్యారెట్ల 10గ్రా.ల గోల్డ్ రేట్ ఉదయంతో పోల్చితే రూ.900 ఎగబాకి రూ.1,11,350 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.1,65,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
News October 30, 2025
రేపు అజహరుద్దీన్ ప్రమాణ స్వీకారం!

TG: కాంగ్రెస్ నేత అజహరుద్దీన్ రేపు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది. మధ్యాహ్నం 12.15గంటలకు రాజ్ భవన్‌లో జరిగే కార్యక్రమంలో ఆయనతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఇందుకు సంబంధించి ఇప్పటికే మంత్రులకు ఆహ్వాన లేఖలు అందినట్లు సమాచారం.


