News November 22, 2024

చెట్లు నరికేయకుండా కర్ర వాడుకోవచ్చు!

image

పచ్చదనాన్ని పరిరక్షించేందుకు జపాన్ ప్రభుత్వం పాటిస్తోన్న పద్ధతిని నెటిజన్లు అభినందిస్తున్నారు. అక్కడ చెట్లను నరకకుండానే కలపను పొందుతుంటారు. అది ఎలా అనుకుంటున్నారా? దైసుగి అనే పురాతన ప్రక్రియలో ఉత్తమమైన దేవదారు వృక్షాలను ఎంపిక చేస్తారు. పొడవుగా పెరిగేందుకు పైన కొమ్మలను కట్ చేస్తుంటారు. ఏపుగా పెరిగిన వృక్షాలను పైనుంచి కత్తిరించి చెక్కను వాడుకుంటారు.

Similar News

News November 23, 2024

ఝార్ఖండ్ ఎన్నికలు.. టార్గెట్ 41

image

ఝార్ఖండ్‌లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలుండగా మేజిక్ ఫిగర్ 41. ఇక్కడ NDA, INDIA కూటములు హోరాహోరీగా తలపడుతున్నాయి. NDA కూటమిలోని BJP-68, AJSU-10, JDU-2, లోక్ జన్‌శక్తి(రామ్ విలాస్ పాశ్వాన్) ఒక చోట పోటీ చేస్తున్నాయి. INDIA కూటమిలోని JMM-42, INC-30, RJD-6, CPI(ML)-3 చోట్ల బరిలో నిలిచాయి. రాష్ట్రంలో ప్రస్తుతం JMM అధికారంలో ఉండగా ఇటీవల వెలువడిన ఎగ్జిట్ పోల్స్‌ సర్వేలు NDAకు మొగ్గు చూపాయి.

News November 23, 2024

నేడే బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ వర్షాలు

image

AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడనుంది. ఇది పశ్చిమ వాయవ్యంగా ప్రయాణించి సోమవారం నాటికి వాయుగుండంగా బలపడనుందని IMD తెలిపింది. తర్వాత తుఫానుగా మారి నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశిస్తుందని పేర్కొంది. ఫలితంగా దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మరోవైపు ఉత్తరం నుంచి వీచే గాలుల ప్రభావంతో కోస్తాంధ్రలో చలి తీవ్రత పెరిగింది.

News November 23, 2024

జానీ మాస్టర్‌కు ఊరట

image

ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్‌కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ఆయనకు తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు ధర్మాసనం డిస్మిస్ చేసింది. హైకోర్టు ఉత్తర్వుల్లో తాము జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. లైంగిక వేధింపుల కేసులో అరెస్టయి జైలుకు వెళ్లిన జానీకి అక్టోబర్ 24న హైకోర్టు బెయిల్ ఇచ్చిన సంగతి తెలిసిందే.