News November 23, 2024
STల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తాం: కలెక్టర్

షెడ్యూల్డ్ తరగతుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారిస్తామని జిల్లా కలెక్టర్ ఓ. ఆనంద్ అన్నారు. శుక్రవారం విడవలూరు మండలం పార్లపల్లి ఎస్‌టీ కాలనీ, కొడవలూరు మండలం నార్త్ రాజుపాలెం ఎస్టీ కాలనీని అధికారులతో కలసి సందర్శించారు. అనంతరం అసోసియేషన్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్(ARD) సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఎస్టీ మహిళల నుంచి అర్జీలు స్వీకరించారు.
Similar News
News January 10, 2026
కాకాణి, సోమిరెడ్డి మధ్య ఇరిగేషన్ వార్ !

నువ్వు దోచుకున్నావంటే.. నువ్వే ఎక్కువ దోచుకున్నావంటూ పరస్పరం కాకాణి, సోమిరెడ్డి విమర్శించుకుంటున్నారు. వీరిద్దరిలో ఎవరు అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా ఇరిగేషన్ పనుల అవినీతే లేవనెత్తుతున్నారు. కనుపూరు కాలువ, కండలేరు స్పిల్ వే, సర్వేపల్లి కాలువ, చెరువు షట్టర్ పనులపై విమర్శించుకుంటున్నారు తప్పితే.. ప్రజలు కష్టాలను గాలికొదిలేస్తున్నారన్నా అపవాదు నెలకొంది.
News January 10, 2026
ఫ్లెమింగో ఫెస్టివల్.. ఇరకం దీవిలో ఇదే స్పెషల్!

పులికాట్ సరస్సుకు మధ్యలో ఉండే ఇరకం దీవికి వెళ్లాలంటే 8 KM పడవ ప్రయాణం చేయాలి. అక్కడి ప్రయాణం ఓ మధురానుభూతిని మిగుల్చుతుంది. చల్లటి గాలులు తేలికపాటి అలల మధ్య సాగే పడవ ప్రయాణం.. గాలివాటున దూసుకెళ్లే తెరచాప పడవలు.. ఓవైపు ఎగురుతూ కనిపించే విదేశీ పక్షులు.. ఈ దృశ్యాలు ఎంతో ఆహ్లాదంగా అద్భుతంగా కనిపిస్తాయి. చుట్టూ ఉప్పునీరున్నా.. ఈ దీవిలో తాగేందుకు మంచినీరు పుష్కలంగా లభించడం ఇక్కడ ప్రత్యేకత.
News January 10, 2026
ఫ్లెమింగో ఫెస్టివల్.. ఆటకానితిప్పలో పక్షుల విన్యాసాలు!

సూళ్లూరుపేట- శ్రీహరికోట దారిలోని ఆటకానితిప్ప వద్ద పులికాట్ సరస్సులో వలస పక్షుల వేట విన్యాసాలు పక్షి ప్రేమకులను కట్టిపడేస్తాయి. సూళ్లూరుపేట నుంచి సూమారు 10 కిలోమీటర్లు దూరంలో ఉంది. ఇక్కడ వన్యప్రాణి విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పక్షుల విజ్ఞాన కేంద్రం ఆకట్టుకుంటుంది.


