News November 23, 2024

రిషభ్ పంత్ ఖాతాలో మరో మైలురాయి

image

టీమ్ ఇండియా ప్లేయర్ రిషభ్ పంత్ ఖాతాలో మరో మైలురాయి చేరింది. వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ చరిత్రలో అత్యధిక పరుగులు చేసిన మూడో భారత ఆటగాడిగా పంత్ నిలిచారు. ఇప్పటివరకు ఆయన 2,032 పరుగులు చేశారు. 52 ఇన్నింగ్సుల్లోనే ఆయన ఈ ఘనత అందుకోవడం విశేషం. తొలి రెండు స్థానాల్లో రోహిత్ (2,685), కోహ్లీ (2,432) ఉన్నారు. అలాగే ఆస్ట్రేలియాలో అత్యధిక పరుగులు చేసిన విదేశీ వికెట్ కీపర్‌గానూ పంత్ (661) రికార్డులకెక్కారు.

Similar News

News November 23, 2024

BREAKING: ఝార్ఖండ్‌లో ఆధిక్యంలో JMM

image

ఝార్ఖండ్‌లో అధికార JMM ఆధిక్యంలోకి వచ్చింది. ఆ పార్టీ 38 స్థానాల్లో లీడ్‌లో కొనసాగుతోంది. BJP 31 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. 81 అసెంబ్లీ సీట్లున్న ఝార్ఖండ్‌లో అధికారం చేపట్టాలంటే 41 సీట్లు అవసరం. కాగా బర్హత్‌లో సీఎం హేమంత్ సోరెన్, గండేలో ఆయన భార్య కల్పన సోరెన్ లీడింగ్‌లో ఉన్నారు. మాజీ సీఎం, బీజేపీ అభ్యర్థి సెరైకెల్లాలో చంపై సోరెన్ ఆధిక్యంలో ఉన్నారు.

News November 23, 2024

మహారాష్ట్ర: కాంగ్రెస్ చీఫ్ నానా పటోలే వెనుకంజ

image

మహారాష్ట్ర ఓట్ల లెక్కింపు ఎర్లీ ట్రెండ్స్‌లో బడా నేతలు వెనకంజలో ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. కాంగ్రెస్ స్టేట్ చీఫ్ నానా పటోలే (సకోలి), మిలింద్ దేవర (వర్లి), జీషన్ సిద్ధిఖీ (వాంద్రె ఈస్ట్) వెనుకంజలో ఉన్నాయి. సీఎం ఏక్‌నాథ్ శిండే (కోప్రి), అజిత్ పవార్ (బారామతి) ఆధిక్యాలు మారుతున్నాయి. కాసేపు ఆధిక్యం, మరికాసేపు వెనుకంజలో ఉంటున్నారు. బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ (నాగ్‌పుర్ సౌత్‌వెస్ట్) జోరుమీదున్నారు.

News November 23, 2024

మహారాష్ట్రలో మహాయుతి హవా

image

మహారాష్ట్ర ఎన్నికల కౌంటింగ్‌లో మహాయుతి ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఈ కూటమి మొత్తం 132 స్థానాల్లో లీడింగ్‌లో కొనసాగుతోంది. అలాగే మహా వికాస్ అఘాడీ కూటమి 123 స్థానాల్లో ఆధిక్యంలో ఉండి గట్టి పోటీ ఇస్తోంది. అలాగే ఝార్ఖండ్‌లోనూ ఎన్డీఏ కూటమి హవా కొనసాగుతోంది. 33 సీట్లలో ఎన్డీయే కూటమి ఆధిక్యం ప్రదర్శిస్తోంది. ఇండియా కూటమి 27 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది.