News November 23, 2024

దీపం-2 స్కీమ్: 50 లక్షలు దాటిన లబ్ధిదారుల సంఖ్య

image

AP: దీపం-2 పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం పేదలకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ఉచితంగా అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పథకం లబ్ధిదారుల సంఖ్య 3 వారాల్లోనే 50 లక్షలకు చేరిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. పథకాన్ని అత్యంత పారదర్శకంగా అమలు చేస్తున్నామని, కొందరు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఈ పథకానికి గ్యాస్ కనెక్షన్, ఆధార్, తెల్ల రేషన్ కార్డు ఉండాలని పేర్కొన్నారు.

Similar News

News October 28, 2025

మొంథా తుఫాన్.. వాహనదారులకు బిగ్ అలర్ట్

image

AP: మొంథా తీవ్ర తుఫాన్ నేపథ్యంలో భారీ వాహనదారులకు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ కీలక హెచ్చరిక జారీ చేసింది. జాతీయ రహదారుల్లో ప్రయాణించే భారీ వాహనాలను రాత్రి 7 గంటల తర్వాత నిలిపివేయనున్నట్లు ప్రకటించింది. వాహనదారులు ముందే సురక్షిత ‘లేబే’ల్లో వాటిని పార్క్ చేసుకోవాలని సూచించింది. అటు ప్రజలు అత్యవసరమైతే తప్ప ప్రయాణాలు చేయవద్దని మరోసారి హెచ్చరించింది.

News October 28, 2025

‘ChatGPT Go’ ఏడాది పాటు ఉచితం!

image

ఇండియన్ యూజర్లను ఆకర్షించేందుకు ChatGPT కీలక నిర్ణయం తీసుకుంది. ‘ChatGPT Go’ సేవలను ఏడాది పాటు ఉచితంగా అందించేందుకు సిద్ధమైంది. నవంబర్ 4 నుంచి SignUp చేసిన కొత్త యూజర్లకు ఈ అవకాశం లభిస్తుందని సంస్థ వెల్లడించింది. ప్రస్తుతం ChatGPT Go ఉపయోగిస్తున్న వారికి కూడా అదనంగా 12 నెలల ఉచిత సేవలు వర్తిస్తాయని తెలిపింది. ఇప్పటికే ఎయిర్‌టెల్ కూడా తన యూజర్లకు ఏడాది పాటు ‘Perplexity Pro’ని ఫ్రీగా అందించింది.

News October 28, 2025

ఈ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ

image

TG: మొంథా తుఫాను ఎఫెక్ట్ రాష్ట్రంలోనూ కనిపిస్తోంది. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు HYD వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశమున్నట్లు పేర్కొంది. ఈ జిల్లాల్లో గంటకు 40-50 కి.మీ. వేగంతో గాలులు వీచే ఛాన్సుందని తెలిపింది.