News November 23, 2024

ఉమ్మడి ప.గో. జిల్లా నేతలకు కీలక పదవులు

image

ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని నేతలను కీలక పదవులు వరించాయి. APC ఛైర్మన్‌గా భీమవరం MLA రామంజనేయులు, అదే కమిటీకి సభ్యుడిగా తణుకు MLA రాధకృష్ణ తాజాగా ఎంపికయ్యారు. ఇటీవల ఉండి MLA రఘురామకు DY. స్పీకర్ పదవి లభించింది. కూటమి ప్రభుత్వం ఏర్పాడ్డాక జిల్లా నేతలను కీలక పదవులు వరించాయి. దీంతో శుక్రవారం CM, డిప్యూటీ సీఎం, పలువురు కూటమి నాయకులు వారికి అభినందనలు తెలిపారు.

Similar News

News September 15, 2025

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక

image

ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు సోమవారం జిల్లా, మండల, డివిజనల్, మున్సిపల్ స్థాయిలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నాగరాణి తెలిపారు. అర్జీదారులు తమ ఫిర్యాదులను సమీపంలోని కార్యాలయాల్లో లేదా meekosam.ap.gov.in వెబ్‌సైట్‌లో సమర్పించుకోవచ్చని ఆమె సూచించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వనియోగం చేసుకోవాలని కోరారు.

News September 14, 2025

వరి రైతుకు గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలి: జేసీ

image

వరి రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి వ్యాపారులను ఆదేశించారు. ఆదివారం ఆయన కడియద్దలో పర్యటించి, వరి కోతలను పరిశీలించారు. అనంతరం రైతులు, ట్రేడర్లతో మాట్లాడి పంట ధర గురించి ఆరా తీశారు. అంతకుముందు ఉల్లిపాయల మార్కెట్‌లో ఉల్లి ధరలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో, తహశీల్దార్ పాల్గొన్నారు.

News September 13, 2025

మహిళల ఆరోగ్యానికి ప్రాధాన్యత: ప.గో కలెక్టర్

image

జిల్లాలో మహిళల ఆరోగ్య పరిరక్షణకు పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ నాగరాణి అన్నారు. శనివారం భీమవారంలోని కలెక్టరేట్‌లో మాట్లాడారు. ‘స్వస్థ నారి – శసక్త్ పరివార్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా ఈ నెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు ఆరోగ్య పరీక్షలు, చికిత్సలు, వైద్య నిపుణుల సేవలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అధికారులకు సూచించారు.