News November 23, 2024

బ్యాంకు అకౌంట్లలోకి బోనస్ నగదు

image

TG: సన్నవడ్లను మార్కెట్లో ప్రభుత్వానికి విక్రయించిన రైతుల ఖాతాల్లో బోనస్ నగదు జమవుతోంది. క్వింటాకు రూ.500 చొప్పున బ్యాంకు అకౌంట్లలో డబ్బు జమైనట్లు ఖమ్మం, జగిత్యాల జిల్లాల్లో పలువురు రైతుల ఫోన్లకు SMSలు వచ్చాయి. సీఎం రేవంత్, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్లతో మెసేజ్లు వస్తున్నట్లు మరికొందరు రైతులు చెబుతున్నారు. సన్న వడ్లను దళారులకు విక్రయించవద్దని, ప్రభుత్వానికే అమ్మాలని అధికారులు కోరుతున్నారు.

Similar News

News February 2, 2026

పీఎం కిసాన్ రూ.6వేలే.. పెంపు లేదు

image

దేశవ్యాప్తంగా పంట పెట్టుబడి సాయం కోసం కేంద్రం పీఎం కిసాన్ స్కీమ్ కింద రైతులకు ఏడాదికి రూ.6వేలు (3 విడతల్లో) ఇస్తున్న సంగతి తెలిసిందే. దీన్ని రూ.8 వేలు లేదా రూ.10 వేలకు పెంచుతారని వార్తలు వచ్చాయి. అయితే బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మల దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. కాగా తెలంగాణలో ఈ స్కీమ్ ద్వారా 30 లక్షల మంది రైతులు లబ్ధి పొందుతున్నారు.

News February 2, 2026

స్కిల్ కేసు నుంచి చంద్రబాబుకు పూర్తి ఊరట!

image

AP: చంద్రబాబు సీఎం అయ్యాక పలు కేసుల నుంచి ఉపశమనం లభిస్తోంది. తాజాగా స్కిల్ డెవలప్మెంట్ కేసు దాదాపుగా ముగిసినట్లేనన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఈ కేసులో చంద్రబాబు అవినీతికి పాల్పడ్డారు అనేందుకు ఎలాంటి ఆధారాలు లేవని CID గతంలోనే పేర్కొంది. కేసు మూసేయాలని కోరడంతో గతనెల 12న కోర్టు ఆమోదించింది. ఈ కేసుతో ఆయనకు సంబంధంలేదని ED కూడా తేల్చేసింది. దీంతో ఆయనకు క్లీన్ చిట్ లభించినట్లు అయ్యింది.

News February 2, 2026

ఐరన్ లోపం-లక్షణాలు

image

ఐర‌న్ లోపం ఉంటే ర‌క్తం త‌గినంత త‌యారు కాదు. ఎర్ర ర‌క్త క‌ణాల సంఖ్య త‌గ్గిపోతుంది. దీంతో చ‌ర్మం పాలిపోయిన‌ట్లు తెల్ల‌గా మారుతుందంటున్నారు నిపుణులు. త‌ర‌చూ చ‌ల్ల‌ని ప‌దార్థాల‌ను తినాల‌నిపించడం, నోట్లో అల్సర్లు, శరీరంలో ఇన్ఫెక్షన్లు ఎక్కువగా రావడం, కాళ్లు, చేతులు చల్లగా ఉండటం వంటి లక్షణాలుంటాయి. ఈ వీటిని గుర్తిస్తే ముందుగానే త‌గిన చికిత్స తీసుకోవ‌చ్చు. దీంతో ఐర‌న్ లోపం నుంచి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.