News November 23, 2024

ఓట్ల లెక్కింపు ప్రారంభం

image

మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికలు సహా దేశంలోని 48 అసెంబ్లీ, 2 ఎంపీ స్థానాల బైపోల్ ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. తొలుత బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తున్నారు. అవి పూర్తయిన తర్వాత ఈవీఎం ఓట్లను లెక్కిస్తారు. కేంద్రాల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. ఉదయం 9 గంటలకు ఎర్లీ ట్రెండ్స్ వెలువడనున్నాయి. మధ్యాహ్నం లోపు రిజల్ట్స్‌పై క్లారిటీ రానుంది.

Similar News

News January 12, 2026

గుమ్మానికి ఎదురుగా కిటికీ ఉండవచ్చా?

image

ఇంటి గుమ్మానికి ఎదురుగా కిటికీ ఉండటం మంచిదంటున్నారు వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు. ఈ నిర్మాణం బయట నుంచి వచ్చే సహజ గాలి, వెలుతురును అన్ని గదుల్లోకి ప్రసరించేలా చేస్తుందంటున్నారు. ‘ఇది గదిలో ఉండే వారికి మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది. ఆరోగ్య సమస్యలు రాకుండా కాపాడుతుంది. ఇల్లు ఎప్పుడూ తాజాదనంతో ఉంటుంది. ఇంట్లో ప్రతికూలత తగ్గి, గృహస్థులు ఉత్సాహంగా తమ జీవితాన్ని గడపడానికి దోహదపడుతుంది’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>

News January 12, 2026

జగదీప్ ధన్‌ఖడ్‌కు తీవ్ర అస్వస్థత

image

మాజీ ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్‌ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈనెల 10న అర్ధరాత్రి 2 సార్లు స్పృహతప్పి పడిపోయారని ఆయన కార్యాలయం తెలిపింది. ఢిల్లీలోని ఎయిమ్స్‌లో అడ్మిట్ చేసినట్లు చెప్పింది. 2025 మార్చిలోనూ ఆయన ఛాతీ నొప్పితో అనారోగ్యానికి గురయ్యారు. దీంతో ఎయిమ్స్ క్రిటికల్ కేర్ యూనిట్‌లో ఉంచి చికిత్స అందించారు. అనారోగ్య కారణాలతో గతేడాది జులైలో ఉపరాష్ట్రపతి పదవికి ఆయన <<17154846>>రాజీనామా<<>> చేయడం తెలిసిందే.

News January 12, 2026

శాంసంగ్‌కు చెక్.. టాప్ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్‌గా యాపిల్

image

స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లలో యాపిల్ కంపెనీ నంబర్ వన్‌గా నిలిచింది. ఐఫోన్ 17 సక్సెస్, 16కు భారీ డిమాండ్, సేల్స్‌లో 10 శాతం గ్రోత్ సాధించడంతో గత 14 ఏళ్లలో తొలిసారిగా టాప్‌లోకి వచ్చింది. శాంసంగ్‌ రెండో స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో యాపిల్ 20%, శాంసంగ్ 19%, షియోమీ 13%, వివో 8%, ఒప్పో 8%, ఇతర బ్రాండ్లు 32% వాటా కలిగి ఉన్నాయి.