News November 23, 2024
చంద్రబాబు, పవన్ న్యాయం చేయాలి: వాలంటీర్లు
AP: తమ ఉద్యోగం తిరిగి తమకు ఇవ్వాలని CM చంద్రబాబు, Dy.CM పవన్ కళ్యాణ్‌ను వాలంటీర్లు వేడుకున్నారు. తక్షణమే తమను విధుల్లోకి తీసుకోవాలని వారు కోరారు. ‘గత ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీ ప్రకారం విధుల్లోకి తీసుకుని రూ.10 వేల వేతనం ఇవ్వాలి. మాకు రాజకీయ రంగు పూయకండి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ ఆదేశాల ప్రకారమే పని చేస్తాం. ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించాలి’ అని వారు విజ్ఞప్తి చేశారు.
Similar News
News November 23, 2024
సిక్సర్లలో జైస్వాల్ రికార్డు
టీమ్ ఇండియా బ్యాటింగ్ సెన్సేషన్ యశస్వీ జైస్వాల్ అరుదైన ఫీట్ సాధించారు. టెస్టు ఫార్మాట్‌లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు (34) కొట్టిన క్రికెటర్‌గా నిలిచారు. 2014లో న్యూజిలాండ్ క్రికెటర్ మెక్కల్లమ్ 33 సిక్సర్లు బాదారు. తాజాగా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్టులో జైస్వాల్ 2 సిక్సర్లు కొట్టి మెక్కల్లమ్ రికార్డును బద్దలు కొట్టారు.
News November 23, 2024
56లక్షల ఫాలోవర్లున్న నటుడు.. వచ్చిన ఓట్లు 146
సోషల్ మీడియాలో లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నంత మాత్రాన ఎన్నికల్లో గెలిచేస్తామనుకోవడం భ్రమేనని మరోసారి రుజువైంది. బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్, యాక్టర్ అజాజ్ ఖాన్‌కు ఇన్‌స్టాలో 56లక్షల ఫాలోవర్లు ఉన్నారు. బయటా ఫ్యాన్‌బేస్ ఉంది. ఆయన మహారాష్ట్రలోని వెర్సోవాలో ఆజాద్ సమాజ్ పార్టీ తరఫున పోటీ చేశారు. 20 రౌండ్ల లెక్కింపు పూర్తయ్యేసరికి ఆయనకు కేవలం 146 ఓట్లే వచ్చాయి. విచిత్రంగా నోటాకు ఇక్కడ 874 ఓట్లు పడ్డాయి.
News November 23, 2024
‘కంగువా’ ఎఫెక్ట్.. నిర్మాతను ఆదుకోనున్న సూర్య?
రూ.350 కోట్లకు పైగా ఖర్చుతో తెరకెక్కిన ‘కంగువా’ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఈ నెల 14న రిలీజైన ఈ చిత్రం ఇప్పటికీ రూ.100 కోట్ల కలెక్షన్లను సాధించలేదు. దీంతో నిర్మాత జ్ఞానవేల్ రాజాకు సాయం చేసేందుకు హీరో సూర్య ముందుకొచ్చినట్లు సమాచారం. చేతినిండా సినిమాలు ఉన్నప్పటికీ స్టూడియో గ్రీన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఓ చిన్న మూవీలో నటించనున్నట్లు తెలుస్తోంది. నామమాత్రపు రెమ్యునరేషన్ మాత్రమే తీసుకుంటారని టాక్.