News November 23, 2024
బాబాయ్‌పై అబ్బాయి ఆధిక్యం..
మహారాష్ట్ర సీఎం అభ్యర్థుల్లో ఒకరిగా ఉన్న అజిత్ పవార్ ఆశ్చర్యకరంగా ఫలితాల్లో వెనకబడ్డారు. బారామతిలో ఆయన సోదరుడి కుమారుడు యుగేంద్ర పవార్ ఆధిక్యత కనబరుస్తున్నట్లు తెలుస్తోంది. యుగేంద్ర తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. శరద్ పవార్ ఫ్యామిలీకి ఈ నియోజకవర్గం కంచుకోట. అటు కొప్రిలో సీఎం ఏక్‌నాథ్ శిండే ఆధిక్యంలో ఉన్నారు.
Similar News
News November 23, 2024
‘కంగువా’ ఎఫెక్ట్.. నిర్మాతను ఆదుకోనున్న సూర్య?
రూ.350 కోట్లకు పైగా ఖర్చుతో తెరకెక్కిన ‘కంగువా’ బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. ఈ నెల 14న రిలీజైన ఈ చిత్రం ఇప్పటికీ రూ.100 కోట్ల కలెక్షన్లను సాధించలేదు. దీంతో నిర్మాత జ్ఞానవేల్ రాజాకు సాయం చేసేందుకు హీరో సూర్య ముందుకొచ్చినట్లు సమాచారం. చేతినిండా సినిమాలు ఉన్నప్పటికీ స్టూడియో గ్రీన్ పిక్చర్స్ బ్యానర్‌పై ఓ చిన్న మూవీలో నటించనున్నట్లు తెలుస్తోంది. నామమాత్రపు రెమ్యునరేషన్ మాత్రమే తీసుకుంటారని టాక్.
News November 23, 2024
ఓటర్ల పరిణతి: నచ్చిన కూటమికి మెచ్చిన తీర్పు
పాలకులను ఎన్నుకోవడంలో ప్రజలు అత్యంత పరిణతి ప్రదర్శిస్తున్నారు. ఊగిసలాట, గందరగోళం, హంగ్ పరిస్థితికి అస్సలు తావివ్వడం లేదు. గెలిపించాలనుకున్న వారికే ఓట్లేస్తున్నారు. కోరుకున్న కూటమికే అధికారం అప్పగిస్తున్నారు. నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తూ భారీ మెజారిటీ అందిస్తున్నారు. ఇప్పుడు మహారాష్ట్రలో మహాయుతికి 220, ఝార్ఖండ్‌లో JMM+కు 55, మొన్న హరియాణాలో BJPకి 48, జమ్మూకశ్మీర్లో NCకి 42 సీట్లు ఇవ్వడమే ఉదాహరణ.
News November 23, 2024
వేగంగా, నెమ్మదిగా.. ఎలా అయినా ఓకే అంటోన్న జైస్వాల్
టీమ్ఇండియా యంగ్ ఓపెనర్ యశస్వీ జైస్వాల్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో అదరగొడుతున్నారు. అవసరమైనప్పుడు వేగం కంటే నిలకడగా ఆడటం ముఖ్యమని తెలుసుకున్నారు. ఈ క్రమంలోనే ఆసీస్‌పై 123 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసుకున్నారు. బంగ్లాదేశ్‌తో టెస్టులో కేవలం 31 బంతుల్లోనే అర్ధ సెంచరీ చేసిన ఆయన ఇలా లాంగ్ ఇన్నింగ్స్ కూడా ఆడగలనని నిరూపిస్తున్నారు. యశస్వీ సెంచరీ దిశగా సాగుతున్నారు.