News November 23, 2024

ఎవరు బాహుబలి..? ఎవరు మహాబలి..?

image

మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రస్తుతం మహాయుతి ఆధిక్యత కనబరుస్తోంది. కాగా ఇందులోని అన్ని పార్టీల సారథులూ సీఎం పదవిపై ఆశలు పెట్టుకున్నారు. శివసేన (శిండే వర్గం) చీఫ్, ప్రస్తుత సీఎం ఏక్‌నాథ్ శిండే మరోసారి సీఎం అవుతానని ధీమాగా ఉన్నారు. అయితే ఆయన కింగ్ మేకర్ అనేలా మారుతారా? మరోసారి BJP ఈ ఛాన్స్ ఇస్తుందా?. ఇక ఈ పదవిని ఆశిస్తున్న NCP (అజిత్ వర్గం) సారథి, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ స్వయంగా వెనకబడ్డారు.

Similar News

News November 9, 2025

తెలంగాణకు మొండిచేయి.. కేంద్ర బృందం రానట్టేనా?

image

పంట నష్టంపై అంచనా వేసేందుకు APలో ఈ నెల 10, 11 తేదీల్లో కేంద్ర బృందం పర్యటించనుంది. 8 మంది అధికారులు 6 జిల్లాల్లో పర్యటించనున్నారు. మరోవైపు ఆగస్టులో ₹10వేల కోట్లు, ఇటీవలి తుఫానుతో ₹5వేల కోట్లు నష్టపోయినట్లు TG ప్రభుత్వం కూడా కేంద్రానికి నివేదిక పంపింది. కానీ దీనిపై కేంద్రం స్పందించలేదు. కనీసం బృందాన్నీ పంపడం లేదు. దీంతో కేంద్రం మరోసారి తెలంగాణకు మొండిచేయి చూపుతోందని విమర్శలు వస్తున్నాయి.

News November 9, 2025

లేటెస్ట్ సినిమా అప్‌డేట్స్

image

✦ ‘పెద్ది’ సినిమాలోని ‘చికిరి చికిరి’ పాటకు 35 గంటల్లో 53+ మిలియన్ వ్యూస్
✦ మహేశ్ బాబు-రాజమౌళి సినిమా నుంచి ఈనెల 11న ప్రియాంక చోప్రా లుక్ రివీల్ చేసే అవకాశం: సినీ వర్గాలు
✦ రణ్‌వీర్ సింగ్ హీరోగా నటిస్తోన్న ‘దురంధర్’ సినిమా నుంచి మాధవన్ పోస్టర్ విడుదల.. బట్టతలతో గుర్తుపట్టలేని విధంగా లుక్
✦ సుధీర్ బాబు ‘జటాధర’ సినిమాకు 2 రోజుల్లో రూ.2.91కోట్ల కలెక్షన్స్

News November 9, 2025

అవనీ లేఖరాకు మరో స్వర్ణం

image

2025 పారా షూటింగ్ ప్రపంచ కప్‌లో షూటింగ్‌లో అవని లేఖరా మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ స్టాండింగ్ SH1లో స్వర్ణం సాధించారు. 11 ఏళ్ల వయసులో కారు ప్రమాదానికి గురికావడంతో అవని కాళ్లు రెండూ చచ్చుబడిపోయాయి. మొదట ఆర్చరీ నేర్చుకున్న ఆమె తర్వాత షూటింగ్‌కు మళ్లారు. రెండు ఒలింపిక్స్‌లో బంగారు పతకాలు గెలుచుకున్న తొలి భారతీయ పారాఅథ్లెట్‌గా కీర్తి గడించింది. వరుస విజయాలు సాధిస్తూ ఎందరికో స్ఫూర్తినిస్తున్నారు అవని.