News November 23, 2024

ప్రియాంక @ 54,000+ మెజార్టీ..

image

వయనాడ్‌లో ప్రియాంకా గాంధీ భారీ మెజార్టీ దిశగా దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఆమె 54 వేలకు పైగా మెజార్టీ సాధించారు. సీపీఎం, బీజేపీ అభ్యర్థులు తర్వాతి స్థానాల్లో ఉన్నారు. తొలిసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్న గాంధీ కుటుంబీకురాలికి 5 లక్షలకు పైగా మెజార్టీ వస్తుందని కాంగ్రెస్ నేతలు ఆశిస్తున్నారు.

Similar News

News November 23, 2024

భర్తకు తోడుగా, పార్టీకి అండగా.. JMM విజయం వెనుక కల్పన

image

ఝార్ఖండ్‌లో JMM విజయం వెనుక కల్పనా సోరెన్ పాత్ర కీలకం. భర్త హేమంత్ సోరెన్ అరెస్టు తర్వాత ఆమె పార్టీ బాధ్యతలను భుజాన వేసుకున్నారు. 39 ఏళ్లకే ఎంతో పరిణతితో వ్యవహరించారు. పార్టీ, కుటుంబ గొడవలను చాకచక్యంగా డీల్ చేశారు. గాండేయ్ బైఎలక్షన్‌లో గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టారు. హేమంత్ జైలు నుంచి వచ్చాక ఆయనతో కలిసి 200 సభల్లో పాల్గొన్నారు. భర్తకు తోడుగా, పార్టీకి అండగా నిలబడి విజయతీరాలకు చేర్చారు.

News November 23, 2024

14 ఏళ్లలో మూడు సార్లే.. ప్రతిసారి KL రాహుల్ తోడు!

image

ఆస్ట్రేలియాతో మొదటి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో 150కే ఆలౌట్ అయిన టీమ్ఇండియా, రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ పడకుండా 172 రన్స్ చేయగలిగింది. గత 14 ఏళ్లలో ’SENA‘ దేశాలపై టెస్టుల్లో టీమ్ఇండియా కేవలం 3 సార్లు 100+రన్స్ భాగస్వామ్యం చేయగలిగినట్లు క్రికెట్ వర్గాలు పేర్కొన్నాయి. లార్డ్స్‌లో రోహిత్-KL రాహుల్, సెంచూరియన్‌లో మయాంక్-రాహుల్, ఇప్పుడు పెర్త్‌లో జైస్వాల్-రాహుల్ 100+ రన్స్ పార్ట్‌నర్‌షిప్ చేయగలిగారు.

News November 23, 2024

డే2: భారత్ 172/0

image

పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ కోల్పోకుండా 172 రన్స్ చేసింది. మొత్తంగా 218 పరుగుల లీడ్ సాధించింది. యశస్వీ జైస్వాల్(90), కేఎల్ రాహుల్(62) నిలకడగా ఆడుతున్నారు.