News November 23, 2024
రెండు రాష్ట్రాల్లోనూ ప్రభుత్వం మాదే: BJP నేత ధీమా
మహారాష్ట్ర, ఝార్ఖండ్‌లో NDA కూటమే ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తుందని BJP అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ ధీమా వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ కుల, విభజన రాజకీయాలను రెండు రాష్ట్రాల ప్రజలు తిరస్కరిస్తారని అన్నారు. ప్రధాని మోదీ ఇచ్చిన ‘ఏక్ హై తో సేఫ్ హై’ నినాదాన్ని వారు అనుసరిస్తున్నారని చెప్పారు. మహారాష్ట్రలో లడ్కీ బెహనా, ఝార్ఖండ్‌లో అక్రమ వలసలు తీవ్ర ప్రభావం చూపించాయని పేర్కొన్నారు.
Similar News
News December 26, 2024
షేక్ హసీనా భవిష్యత్తు ఎటు?
భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లా మాజీ ప్రధాని షేక్ హసీనా భవితవ్యం ఆసక్తికరంగా మారింది. యూనస్ సర్కారు ఆమెను అప్పగించాలని భారత్‌ను అడిగిన నేపథ్యంలో హసీనా పూర్తిగా భారత్ దయపై ఆధారపడ్డారు. శరణార్థుల అప్పగింత ఒప్పందం ప్రకారం హసీనాను భారత్ అప్పగించాల్సి ఉన్నా.. యూనస్ భారత వ్యతిరేక వైఖరి కారణంగా హసీనాకు రక్షణ కల్పించేందుకే భారత్ నిర్ణయించుకునే అవకాశం ఉంటుందని కేంద్ర ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.
News December 26, 2024
జైల్లో అల్లర్లు: 1500మంది పరారీ.. 33మంది మృతి
మొజాంబిక్ రాజధాని మపూటోలోని ఓ జైల్లో తాజాగా చెలరేగిన అల్లర్లలో 1534మంది క్రిమినల్స్ జైలు నుంచి పరారు కాగా 33మంది మృతిచెందారు. 15మంది తీవ్రంగా గాయపడ్డారు. ఎన్నికల్లో అధికార పార్టీదే విజయమని ఆ దేశ సుప్రీం కోర్టు ప్రకటించడంతో ప్రతిపక్షాలు మొదలుపెట్టిన అల్లర్లు జైలు వరకూ విస్తరించాయి. 150మందిని తిరిగి పట్టుకున్నామని, మిగిలిన ఖైదీల కోసం గాలింపు చేపట్టామని అధికారులు తెలిపారు.
News December 26, 2024
సీఎం తన తమ్ముడిపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదు: హరీశ్
TG: సంధ్య థియేటర్ ఘటనను ప్రభుత్వం రాజకీయం చేస్తోందని మాజీ మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. సినిమా వాళ్లను భయపెట్టి CM మంచి చేసుకోకూడదని హితవు పలికారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను ఆయన పరామర్శించారు. రాష్ట్రంలో ఓ సర్పంచి ఆత్మహత్యకు కారణమైన CM తమ్ముడిని ఎందుకు అరెస్ట్ చేయడంలేదని ప్రశ్నించారు. చట్టం అందరికీ సమానమన్న ముఖ్యమంత్రి, తన తమ్ముడిపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ధ్వజమెత్తారు.