News November 23, 2024
పవన్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో ఫలితాలిలా..

మహారాష్ట్ర ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన స్థానాల్లో బీజేపీ అధిక్యంలో ఉంది. NDA తరఫున పుణె, బల్లార్‌పూర్, డెగ్లూర్, షొలాపూర్, లాతూర్ నియోజకవర్గాల్లో జనసేనాని క్యాంపెయిన్ చేశారు. మరాఠీ భాష, హిందుత్వ, సనాతన అంశాలను ఆయన ప్రస్తావించారు. మరోవైపు తెలంగాణ సీఎం రేవంత్ ప్రచారం చేసిన షొలాపూర్ సహా నాందేడ్, నయాగావ్, భోకర్ ప్రాంతాల్లో సైతం మహాయుతి ఆధిక్యంలో ఉండటం గమనార్హం.
Similar News
News December 30, 2025
నేడు ఉత్తర ద్వార దర్శనం చేసుకోలేకపోతే?

నేడు ఉత్తర ద్వార దర్శనం చేసుకోలేని వారికి ఇతర పరిహారాలెన్నో ఉన్నాయి. పండితుల సూచన ప్రకారం.. విష్ణుమూర్తి పటం ముందు దీపం వెలిగించి, ఆయనను మనస్ఫూర్తిగా పూజిస్తే వైకుంఠ ద్వార దర్శన భాగ్యం దక్కినట్లేనట. అలాగే ‘వైకుంఠ ఏకాదశి వ్రతం’ ఆచరించాలని సూచిస్తున్నారు. ఉపవాసం, జాగరణ, విష్ణు సహస్రనామ పారాయణలతో ఉత్తర ద్వార దర్శనంతో సమానమైన ఫలితం దక్కుతుందని, వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం.
News December 30, 2025
ఇక నుంచి స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ సచివాలయాలు

AP: గ్రామ, వార్డు సచివాలయాల పేరును ప్రభుత్వం అధికారికంగా మార్చింది. ఇక నుంచి ‘స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామ సచివాలయాలు’గా మారుస్తూ ఆర్డినెన్స్ జారీకి నిన్న క్యాబినెట్ ఆమోదం తెలిపింది. స్వర్ణాంధ్ర లక్ష్య సాధనలో గ్రామ, వార్డు సచివాలయాలు కీలకపాత్ర పోషించనున్నాయని మంత్రులు పేర్కొన్నారు. జిల్లా GSWS కార్యాలయాల పేరు కూడా మారుస్తామని వెల్లడించారు.
News December 30, 2025
టోకెన్లు లేని భక్తులు జనవరి 2 నుంచి రావాలి: టీటీడీ ఈవో

AP: వైకుంఠ ద్వారదర్శనాలు ప్రణాళిక ప్రకారం జరుగుతున్నాయని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. ఈ మూడు రోజులు ఆన్‌లైన లక్కీ డిప్ ద్వారా టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఇస్తామని చెప్పారు. టోకెన్లు లేని భక్తులు జనవరి 2న నేరుగా రావాలని విజ్ఞప్తి చేశారు. వారికి జనవరి 8 వరకు దర్శనాలకు అనుమతి ఇస్తామని పేర్కొన్నారు.


