News November 23, 2024

మహారాష్ట్రలో ‘మహా’ ప్రభంజనం

image

మహారాష్ట్రలో మహాయుతి ప్రభంజనం సృష్టిస్తోంది. ఏకంగా 225 స్థానాల్లో స్పష్టమైన ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇందులో బీజేపీ 118, శివసేన షిండే వర్గం 56, ఎన్సీపీ 37 స్థానాల్లో లీడింగ్‌లో ఉంది. ఇక ఓట్ల పరంగా చూసుకుంటే బీజేపీ 23శాతం, శివసేన షిండే వర్గం 13శాతం, ఎన్సీపీ 14శాతం సాధించాయి. మరోవైపు తొలుత కాస్త పోటీ ఇచ్చిన మహావికాస్ అఘాడీ తర్వాత పూర్తిగా చేతులెత్తేసింది. ఆ కూటమి 56 స్థానాల్లోనే లీడింగ్‌లో ఉంది.

Similar News

News March 25, 2026

నల్గొండ: నియోజకవర్గ ఏర్పాటుపై గిరిజనుల గళం

image

సాగర్ ఆయకట్టు పరిధిలో గిరిజన ప్రత్యేక నియోజకవర్గ ఏర్పాటుపై చర్చ జోరందుకుంది. దామరచర్ల, తిరుమలగిరి(సాగర్), త్రిపురారం, నిడమనూరు మండలాల్లో గిరిజన జనాభా అధికంగా ఉండటమే ఇందుకు ప్రధాన కారణం. ఈ 4 మండలాల్లో కలిపి దాదాపు 30 వేలకు పైగా గిరిజన ఓటర్లు ఉండటంతో, వీటిని కలిపి ‘త్రిపురారం’ లేదా పాత తాలూకా కేంద్రమైన ‘నిడమనూరు’ పేరుతో కొత్త నియోజకవర్గం ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది.

News March 25, 2026

86 కాంట్రాక్ట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

image

నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (NIT), తిరుచిరాపల్లి కాంట్రాక్ట్ పద్ధతిలో 86 అసిస్టెంట్ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత: డిగ్రీ, BE/BTech,ME/ఎంటెక్‌/Msc,MA/ఎంఈడీ/Phdతో పాటు ఉద్యోగ అనుభవం ఉండాలి. వయసు 35 ఏళ్లు మించకూడదు. విద్యార్హత, ఇంటర్వ్యూలతో ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌లో 06.04.26, ఆఫ్‌లైన్‌లో 16.04.26 వరకు దరఖాస్తు చేయవచ్చు. పూర్తి వివరాలకు www.nitt.edu చూడండి.