News November 23, 2024
మహాయుతికి అభయమిచ్చిన ‘విదర్భ’
మహారాష్ట్ర ఫలితాల్లో మహాయుతి దూకుడుకు ‘విదర్భ’ అండగా నిలిచింది. ఇక్కడ 62కు 40+ సీట్లలో BJP+ ఆధిక్యం ప్రదర్శిస్తోంది. చారిత్రకంగా ఇది కాషాయ కంచుకోట. అలాంటిది 2024లో 10 లోక్‌సీభ సీట్లకు 7 MVA గెలిచి దెబ్బకొట్టింది. అందులో కాంగ్రెస్ 5 గెలిచింది. మహాయుతి 3కే పరిమితమైంది. ఈ ప్రాంతంలో దళిత, మరాఠా, కుంబి, ముస్లిం జనాభా అధికంగా ఉంటుంది. బటేంగేతో, ఏక్ హైతో నినాదాలు బాగా పనిచేసినట్టు విశ్లేషకుల అంచనా.
Similar News
News November 27, 2024
నేడు మోదీతో టీబీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేల భేటీ
తెలంగాణ బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇవాళ ప్రధాని మోదీతో ఢిల్లీలో భేటీ కానున్నారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత వీరంతా ప్రధానిని కలవడం ఇదే తొలిసారి. రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాలపై ప్రజాప్రతినిధులు మోదీతో చర్చించనున్నారు. భవిష్యత్తు కార్యాచరణపై ఆయన వారికి దిశానిర్దేశం చేసే అవకాశం ఉంది.
News November 27, 2024
ALERT.. నేడు భారీ వర్షాలు
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ ఇవాళ తుఫానుగా బలపడే అవకాశముందని APSDMA పేర్కొంది. దీని ప్రభావంతో నేటి నుంచి 4 రోజుల పాటు కోస్తాంధ్ర, రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లో భారీవర్షాలు కురుస్తాయని పేర్కొంది. మిగతా చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేసింది.
News November 27, 2024
RGV ముందస్తు బెయిల్ పిటిషన్లపై నేడు హైకోర్టులో విచారణ
సినీ దర్శకుడు <<14719310>>రామ్ గోపాల్ వర్మ<<>> దాఖలు చేసిన 3 ముందస్తు బెయిల్ పిటిషన్లపై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. చంద్రబాబు, పవన్, లోకేశ్‌పై అసభ్యకర పోస్టులు పెట్టారని ఆర్జీవీపై ఒంగోలు, విశాఖ, గుంటూరులో కేసులు నమోదయ్యాయి. ఏడాది క్రితం పెట్టిన పోస్టులకు ఇప్పుడు మనోభావాలు దెబ్బతిన్నాయా అంటూ తాజాగా ఆయన ఓ వీడియో విడుదల చేశారు. తాను పరారీలో లేనని, మూవీ షూటింగ్‌లో బిజీగా ఉన్నానని చెప్పారు.