News November 23, 2024

ప్రియాంక మెజార్టీ 2,00,000+

image

వయనాడ్‌లో ప్రియాంక గాంధీ బంపర్ విక్టరీ ఖాయమని స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఆమె మెజార్టీ 2 లక్షలు దాటింది. దీంతో కాంగ్రెస్ ప్రముఖులు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. కాగా కాంగ్రెస్ కంచుకోటలో పోటీ చేస్తున్న నవ్య హరిదాస్ మూడో స్థానానికి పరిమితమయ్యారు.

Similar News

News November 23, 2024

కేంద్ర మంత్రి వ‌ర్గంలోకి శిండే?

image

మ‌హారాష్ట్రలో మ‌హాయుతి భారీ విజ‌యం సాధించ‌డంతో CM పీఠంపై ఉత్కంఠ నెల‌కొంది. కూట‌మిలో అత్య‌ధికంగా 132 సీట్ల‌లో ముందంజ‌లో ఉన్న BJP CM ప‌ద‌విని వ‌దులుకోకపోవచ్చు. దీంతో ఏక్‌నాథ్ శిండే, అజిత్ ప‌రిస్థితి ఏంటనే ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్ర‌మంలో శిండేకు కేంద్ర మంత్రి ప‌ద‌వి ఇవ్వాలని BJP యోచిస్తున్న‌ట్టు తెలుస్తోంది. అజిత్‌ను మాత్రం Dy.CMగా కొన‌సాగించవచ్చని సమాచారం.

News November 23, 2024

ప్రియాంక గురించి ఇందిరా గాంధీ మాటల్లో

image

ప్రియాంకా గాంధీ గురించి ఇందిరా గాంధీ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. 1984లో తన హ‌త్య‌కు 2 రోజుల ముందు సెక్రటరీతో ఇందిరా గాంధీ మాట్లాడుతూ ‘నేను ఎక్కువ రోజులు బ‌తక్కపోవ‌చ్చు. కానీ మీరు ప్రియాంక ఎదుగుద‌ల‌ను చూస్తారు. ప్ర‌జ‌లు ఆమెలో న‌న్ను చూసుకుంటారు. ఆమెను చూసిన‌ప్పుడు న‌న్ను గుర్తు చేసుకుంటారు. ప్రియాంక ఎంతో సాధిస్తుంది. త‌రువాతి శ‌తాబ్దం ఆమెదే. ప్ర‌జ‌లు న‌న్ను మ‌రిచిపోతారు’ అని వ్యాఖ్యానించారు.

News November 23, 2024

కొత్త వంగడాలు, ఆవిష్కరణలతో స్టాళ్లు: సీఎం రేవంత్

image

TG: ప్రజా ప్రభుత్వ విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 30న మహబూబ్‌నగర్‌లో నిర్వహించనున్న రైతు సదస్సుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై రైతులకు అవగాహన కల్పించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వర్సిటీలు అభివృద్ధి చేసిన కొత్త వంగడాలు, ఆయిల్ పామ్ కంపెనీల ఆవిష్కరణలు, నూతన ఉత్పాదకాలతో 3 రోజులు స్టాళ్లు ఏర్పాటుచేయాలని సూచించారు.