News November 23, 2024
భారీగా పెరిగిన బంగారం ధర
బంగారం ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. వారం రోజులుగా పెరుగుతూ వస్తున్న రేట్లు ఇవాళ మరోసారి భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) రూ.820 పెరిగి రూ.79,640కి చేరింది. 22 క్యారెట్ల బంగారం (10గ్రాములు) రూ.750 పెరిగి రూ.73,000కి చేరింది. వెండి ధర కిలో రూ.1,01,000గా ఉంది. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.
Similar News
News November 23, 2024
కొత్త వంగడాలు, ఆవిష్కరణలతో స్టాళ్లు: సీఎం రేవంత్
TG: ప్రజా ప్రభుత్వ విజయోత్సవాల్లో భాగంగా ఈ నెల 30న మహబూబ్‌నగర్‌లో నిర్వహించనున్న రైతు సదస్సుపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులు, సాంకేతిక పరిజ్ఞాన వినియోగంపై రైతులకు అవగాహన కల్పించేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. వర్సిటీలు అభివృద్ధి చేసిన కొత్త వంగడాలు, ఆయిల్ పామ్ కంపెనీల ఆవిష్కరణలు, నూతన ఉత్పాదకాలతో 3 రోజులు స్టాళ్లు ఏర్పాటుచేయాలని సూచించారు.
News November 23, 2024
ఝార్ఖండ్‌లో హిమంతకు ఎదురుదెబ్బ
ఝార్ఖండ్‌లో అస్సాం CM హిమంత బిశ్వ శర్మ వేసిన పాచికలు పారలేదు. బంగ్లా చొరబాటుదారులు స్థానిక మెజారిటీ గిరిజనుల హక్కులు లాక్కుంటున్నారని బిల్డ్ చేసిన నెరేటివ్ ప్రభావం చూపలేదు. ట్రైబల్ స్టేట్‌లో కమ్యూనల్ పోలరైజేషన్ ఫలితాన్నివ్వలేదు. రోటీ-బేటి-మట్టీ నినాదం ఓటర్లను ఆకర్షించలేదు. మహిళలకు ఆర్థిక సాయం పథకాలు, హేమంత్ సోరెన్ అరెస్టు వల్ల ఏర్పడిన సానుభూతి JMMకు లాభం చేశాయి.
News November 23, 2024
హిందీ మహా విద్యాలయం అనుమతులు రద్దు
హైదరాబాద్‌లోని హిందీ మహా విద్యాలయం అనుమతులను ఉస్మానియా యూనివర్సిటీ (OU) రద్దు చేసింది. విద్యార్థుల మార్కుల జాబితాలో అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలు నిజం అని దర్యాప్తులో తేలడంతో తాజా నిర్ణయం తీసుకుంది. మరోవైపు, హిందీ మహా విద్యాలయం అటానమస్ హోదాను రద్దు చేయాలని UGCకి సిఫార్సు చేసింది. ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకు నష్టం కలగకుండా కోర్సు పూర్తి చేసేందుకు OU అవకాశం కల్పించింది.