News November 23, 2024
తిలక్ వర్మ హ్యాట్రిక్ సెంచరీ
టీమ్ ఇండియా ప్లేయర్ తిలక్ వర్మ హ్యాట్రిక్ సెంచరీ బాదారు. SMATలో భాగంగా ఇవాళ మేఘాలయతో జరిగిన మ్యాచ్‌లో తిలక్ (151) సెంచరీ చేశారు. 67 బంతుల్లోనే ఆయన 14 ఫోర్లు, 10 సిక్సర్లతో 151 పరుగులు చేసి విధ్వంసం సృష్టించారు. కాగా దక్షిణాఫ్రికా టీ20 సిరీస్‌లో కూడా తిలక్ వరుస సెంచరీలతో చెలరేగిన సంగతి తెలిసిందే. 3rd, 4th మ్యాచుల్లో ఆయన శతకాలు బాదారు.
Similar News
News November 23, 2024
అభివృద్ధి, సుపరిపాలనలు గెలిచాయి: మోదీ
మహారాష్ట్ర ఓటర్లు ఎన్డీయేకి చారిత్రక విజయాన్ని కట్టబెట్టారని ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా మహిళలు, యువత తమవైపు నిలబడ్డారని పేర్కొన్నారు. మహారాష్ట్రలో అభివృద్ధి, సుపరిపాలనలు గెలిచాయని అభివర్ణించారు. ఎన్నికల్లో ప్రతిఒక్క ఎన్డీయే కార్యకర్త కష్టపడ్డారని, వారందరికీ థాంక్స్ చెబుతున్నానన్నారు. మరోవైపు ఝార్ఖండ్‌లో విజయం సాధించిన JMM కూటమికి మోదీ కంగ్రాట్స్ చెప్పారు.
News November 23, 2024
RESULTS UPDATES: మాజీ CM కుమారుడి ఓటమి
* కర్ణాటక: శిగ్గావ్ ఉప ఎన్నికలో మాజీ CM బొమ్మై కుమారుడు భరత్ ఓటమి
* MP: విజయపూర్‌లో మంత్రి రామ్‌నివాస్ రావత్ ఓటమి
* బిహార్: 4 స్థానాల్లోనూ(ఉప ఎన్నిక) NDA గెలుపు
* కర్ణాటక: 3 అసెంబ్లీ స్థానాల్లోనూ(బై పోల్) INC విక్టరీ
* పంజాబ్: డేరాబాబా నానక్‌లో గుర్‌దీప్ సింగ్ (AAP) గెలుపు
* ఝార్ఖండ్‌లో JMM కూటమి హవా.. ప్రజా తీర్పును గౌరవిస్తున్నాం: చంపై సోరెన్
News November 23, 2024
38 ఏళ్ల తర్వాత భారత ఓపెనింగ్ జోడీ అదుర్స్
ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో భారత ఓపెనర్లు జైస్వాల్(90*), కేఎల్ రాహుల్(62*) రికార్డు సృష్టించారు. AUS గడ్డపై 20 ఏళ్ల తర్వాత ఓపెనింగ్ సెంచరీ(172*) భాగస్వామ్యం నమోదు చేశారు. 2004లో సెహ్వాగ్-ఆకాశ్ చోప్రా 123 రన్స్ చేశారు. అలాగే ఆ దేశంలో 38 ఏళ్ల తర్వాత 150కి పైగా పరుగులు చేసిన భారత ఓపెనింగ్ జోడీగా జైస్వాల్, రాహుల్ నిలిచారు. చివరగా 1986లో గవాస్కర్-శ్రీకాంత్ జోడీ 191 రన్స్ పార్ట్‌నర్‌షిప్ నమోదుచేసింది.