News November 23, 2024
రాజవొమ్మంగి: 35 గోల్డ్ మెడల్స్ గెలిచిన ఒకే పాఠశాల విద్యార్థులు

తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలంలోని ఏకలవ్య పాఠశాల విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీల్లో 35 గోల్డ్ మెడల్స్, 4 సిల్వర్, 4 బ్రాంజ్ మెడల్స్ కైవసం చేసుకున్నారని ప్రిన్సిపల్ కృష్ణారావు శనివారం మీడియాకు తెలిపారు. అరకులో జరిగిన జూడో, వెయిట్ లిఫ్టింగ్, యోగా, వాలీబాల్ క్రీడల్లో విజేతలుగా నిలిచారని చెప్పారు. విజేతలతోపాటు వారికి శిక్షణ ఇచ్చిన సిబ్బందిని సైతం ప్రిన్సిపల్, టీచర్స్ అభినందించారు.
Similar News
News January 11, 2026
ఖేలో ఇండియాలో ఏపీకి రజతం.. దేవరపల్లి క్రీడాకారుల ప్రతిభ!

గుజరాత్‌లోని డామన్ అండ్ డయ్యూలో జరిగిన రెండవ ఖేలో ఇండియా గేమ్స్‌లో ఏపీ సెపక్ తక్రా జట్టు రెండోస్థానం సాధించింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఫైనల్లో ఒక్క పాయింట్ తేడాతో బీహార్‌పై ఓడి రజతంతో సరిపెట్టుకుంది. ఏపీ జట్టులో ప్రతిభచాటిన దేవరపల్లి క్రీడాకారులు లక్కా గణపతి, పాటంశెట్టి సాయిలను సొసైటీ ఛైర్మన్ ఉప్పులూరు రామారావు, హరికృష్ణ ప్రత్యేకంగా అభినందించి, భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.
News January 11, 2026
రాజమండ్రి: ఈ నెల 13నుంచి జిల్లా స్థాయి సంప్రదాయ క్రీడా పోటీలు

సంక్రాంతి పండగను పురస్కరించుకుని జిల్లా స్థాయి సంప్రదాయ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా సాధికార అధికారి డీఎమ్‌ఎమ్ శేషగిరి నేడు ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజల్లో సాంస్కృతిక వారసత్వంపై అవగాహనతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందించే లక్ష్యంతో ఈ పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపింది.ఈ పోటీలు 13వ తేదీ నుంచి ఎస్.కె.వి.టి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణంలో జరగనున్నాయన్నారు.
News January 11, 2026
కోడి పందాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవు: ఎస్పీ నరసింహ

సంక్రాంతి నేపథ్యంలో కోడి పందాలు, పేకాట తదితర చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ నర్సింహ కిషోర్ హెచ్చరించారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో కోడిపందాలకు ఏర్పాటు చేసిన బరులను ధ్వంసం చేశామని, కోడి కత్తుల తయారు చేస్తున్న వారిపై కేసులు నమోదు చేసినట్లు చెప్పారు. పోలీస్ నిబంధనలు అతిక్రమించరాదంటూ విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నట్లు ఎస్పీ తెలిపారు.


