News November 23, 2024
సమగ్ర కుటుంబ సర్వేలో సీఎస్ శాంతికుమారి
TG: సీఎస్ శాంతికుమారి సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొని తమ కుటుంబ వివరాలు సమర్పించారు. కాగా రాష్ట్రంలో ఇప్పటికే కోటి కుటుంబాల గణన పూర్తయింది. కొన్ని జిల్లాల్లో నూటికి నూరు శాతం సర్వే పూర్తి చేశారు. నల్గొండ, జనగాం, ములుగు, మెదక్, భువనగిరి, జగిత్యాల, గద్వాల జిల్లాల్లో దాదాపు పూర్తైంది. సర్వేలో భాగంగా రాష్ట్రంలో మొత్తం 1,16,14,349 కుటుంబాలు ఉన్నట్లు ప్రభుత్వం గుర్తించింది.
Similar News
News November 23, 2024
రాహుల్ రికార్డును బ్రేక్ చేసిన ప్రియాంక.. మెజారిటీ 4,10,931
వయనాడ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకా గాంధీ భారీ విజయాన్ని నమోదు చేశారు. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ సాధించిన 3.60 లక్షల మెజారిటీ రికార్డును బ్రేక్ చేసి 4,10,931 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఎల్‌డీఎఫ్ అభ్యర్థి సత్యన్ మోకెరీ రెండో స్థానానికి, బీజేపీ అభ్యర్థి నవ్యా హరిదాస్ మూడో స్థానానికి పరిమితమయ్యారు. విజయం సాధించిన అనంతరం కలిసిన ప్రియాంకకు ఖర్గే శుభాకాంక్షలు తెలిపారు.
News November 23, 2024
జగన్ వద్ద మంత్రిగా చేసినందుకు బాధపడుతున్నా: బాలినేని
AP: వైఎస్ జగన్ హయాంలో జరిగిన సోలార్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో తన ప్రమేయం లేదని జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. సంబంధిత పత్రాలపై అప్పటి మంత్రిగా తాను సంతకం చేయలేదని తెలిపారు. క్యాబినెట్లో చర్చించకుండానే యూనిట్ రూ.2.49తో ఒప్పందం చేసుకున్నారన్నారు. ఈ కేసులో జగన్ పాత్ర ఉంటే క్షమించరానిదని పేర్కొన్నారు. ఇవన్నీ చూస్తే ఆయన వద్ద మంత్రిగా పనిచేసినందుకు బాధపడుతున్నానని చెప్పారు.
News November 23, 2024
త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కనున్న తమన్నా, విజయ్?
ప్రేమ జంట తమన్నా భాటియా, విజయ్ వర్మ పెళ్లికి సిద్ధమైనట్లు బాలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. ముంబైలో కలిసి ఉండటానికి వీరు ఓ లగ్జరీ అపార్ట్‌మెంట్ కోసం వెతుకుతున్నట్లు సమాచారం. ఇప్పటికే వివాహ పనులు మొదలుపెట్టారని, అతి త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఆరంభంలోనే ఈ కబురు ఉంటుందని టాక్. లస్ట్ స్టోరీస్-2 తర్వాత రిలేషన్‌లో ఉన్నట్లు తమన్నా-విజయ్ ప్రకటించిన విషయం తెలిసిందే.