News November 23, 2024
జూబ్లీహిల్స్: సమగ్ర కుటుంబ సర్వేలో పాల్గొన్న సీఎస్

సమగ్ర కుటుంబ సర్వేలో సీఎస్ శాంతి కుమారి పాల్గొని వివరాలను అందజేశారు. శుక్రవారం సీఎస్ ఇంటికి వెళ్లిన అధికారులు వివరాలను సేకరించారు. అధికారులకు సీఎస్ పూర్తి వివరాలు సంబంధిత పత్రాలు అందజేసినట్లు పేర్కొన్నారు. సర్వే ప్రక్రియను ఎన్యుమరేటర్ నీరజ, సర్కిల్ నోడల్ అధికారి సాయి శ్రీనివాస్, జూబ్లీహిల్స్ సర్కిల్ డిప్యూటీ కమిషనర్ ప్రశాంతి పరిశీలించారు.
Similar News
News October 25, 2025
HYD: తెలంగాణకు KTRకు ఏం సంబంధం?: MLA

తెలంగాణకు KTRకు సంబంధం ఏంటని కాంగ్రెస్ MLA మందుల సామెల్ హాట్ కామెంట్స్ చేశారు. ‘TG ఉద్యమం గురించి KTRకు తెలుసా? మీ పార్టీ దొంగల పాళ్యం. నిన్ను నాయకుడని ప్రజలు ఇంకా గుర్తించట్లేదు. మీరు చేసిన అప్పు రూ.8 లక్షల కోట్లు మీ దగ్గరే ఉన్నాయి. మీ చెల్లిని ఎందుకు బయటకు పంపారో చెప్పు. మీపార్టీ బుడబుక్కల పార్టీ. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేస్తే మీ పార్టీలో ఒక్కరు మిగలరు’ అని గాంధీ భవన్‌లో అన్నారు.
News October 25, 2025
రాజేంద్రనగర్: అగ్రికల్చర్ కోర్సులో మరో 150 సీట్లు

ప్రొ.జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలో ఈ ఏడాది బీఎస్సీ(ఆనర్స్) అగ్రికల్చర్ కోర్సులో మరో 150 సీట్లు అందుబాటులోకి రానున్నాయని ఉప కులపతి అల్దాస్ జానయ్య ప్రకటించారు. ప్రభుత్వం PJTAUకి 3 నూతన వ్యవసాయ కళాశాలలని మంజూరు చేసిందని హుజూర్‌నగర్ కళాశాలలో 30 సీట్లు, కొడంగల్‌లో రానున్న కళాశాలలో 30 సీట్లు, నిజామాబాద్ కళాశాలలో 30 సీట్లు అందుబాటులోకి రానున్నాయని జానయ్య వివరించారు.
News October 24, 2025
ఓయూ MBA పరీక్షా ఫలితాల విడుదల

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని ఎంబీఏ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఎంబీఏ (సీబీసీఎస్) రెండో సెమిస్టర్ రెగ్యులర్, మొదటి సెమిస్టర్ బ్యాక్ లాగ్, ఇంప్రూవ్మెంట్ పరీక్షా ఫలితాలను విడుదల చేసినట్లు చెప్పారు. ఈ ఫలితాలను ఓయూ వెబ్‌సైట్ www.osmania.ac.inలో అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు.


