News November 23, 2024

ప్రియాంకపై జాతీయ జనసేన అభ్యర్థి పోటీ

image

కేరళ వయనాడ్‌ ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకా గాంధీ గెలుపు దిశగా సాగుతున్నారు. అయితే ఈమెపై ఓ తెలుగు వ్యక్తి జాతీయ జనసేన పార్టీ తరఫున పోటీ చేశారు. తిరుపతికి చెందిన ఆయన పేరు దుగ్గిరాల నాగేశ్వరరావు. ఈయన పార్టీకి అధ్యక్షుడు కూడా. AP ప్రత్యేక హోదా అంశాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదని, జాతీయ స్థాయిలో వినిపించాలనే పోటీ చేస్తున్నానన్నారు. ఆయనకు ప్రస్తుతానికి 273 ఓట్లు వచ్చాయి.

Similar News

News November 23, 2024

హిందీ మహా విద్యాలయం అనుమతులు రద్దు

image

హైదరాబాద్‌లోని హిందీ మహా విద్యాలయం అనుమతులను ఉస్మానియా యూనివర్సిటీ (OU) రద్దు చేసింది. విద్యార్థుల మార్కుల జాబితాలో అక్రమాలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలు నిజం అని దర్యాప్తులో తేలడంతో తాజా నిర్ణయం తీసుకుంది. మరోవైపు, హిందీ మహా విద్యాలయం అటానమస్ హోదాను రద్దు చేయాలని UGCకి సిఫార్సు చేసింది. ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకు నష్టం కలగకుండా కోర్సు పూర్తి చేసేందుకు OU అవకాశం కల్పించింది.

News November 23, 2024

రాహుల్ రికార్డును బ్రేక్ చేసిన ప్రియాంక.. మెజారిటీ 4,10,931

image

వయనాడ్‌లో కాంగ్రెస్ అభ్య‌ర్థి ప్రియాంకా గాంధీ భారీ విజ‌యాన్ని న‌మోదు చేశారు. గ‌త ఎన్నిక‌ల్లో రాహుల్ గాంధీ సాధించిన 3.60 ల‌క్ష‌ల మెజారిటీ రికార్డును బ్రేక్ చేసి 4,10,931 ఓట్ల ఆధిక్యంతో విజ‌యం సాధించారు. ఎల్‌డీఎఫ్ అభ్య‌ర్థి స‌త్య‌న్ మోకెరీ రెండో స్థానానికి, బీజేపీ అభ్య‌ర్థి న‌వ్యా హ‌రిదాస్ మూడో స్థానానికి ప‌రిమిత‌మ‌య్యారు. విజయం సాధించిన అనంతరం కలిసిన ప్రియాంకకు ఖర్గే శుభాకాంక్షలు తెలిపారు.

News November 23, 2024

జగన్ వద్ద మంత్రిగా చేసినందుకు బాధపడుతున్నా: బాలినేని

image

AP: వైఎస్ జగన్ హయాంలో జరిగిన సోలార్ విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంలో తన ప్రమేయం లేదని జనసేన నేత బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. సంబంధిత పత్రాలపై అప్పటి మంత్రిగా తాను సంతకం చేయలేదని తెలిపారు. క్యాబినెట్లో చర్చించకుండానే యూనిట్ రూ.2.49తో ఒప్పందం చేసుకున్నారన్నారు. ఈ కేసులో జగన్ పాత్ర ఉంటే క్షమించరానిదని పేర్కొన్నారు. ఇవన్నీ చూస్తే ఆయన వద్ద మంత్రిగా పనిచేసినందుకు బాధపడుతున్నానని చెప్పారు.