News November 23, 2024
BRS ఖాతాలో రూ.1,449 కోట్లు.. YCP అకౌంట్‌లో రూ.29 కోట్లు
తమ పార్టీ ఖాతాలో రూ.1,449 కోట్లు ఉన్నట్లు ఎన్నికల సంఘానికి బీఆర్ఎస్ నివేదిక ఇచ్చింది. దీంతో దేశంలోనే రిచ్చెస్ట్ పార్టీగా బీఆర్ఎస్ అవతరించింది. మరే పార్టీ ఖాతాలో ఇంత భారీ ఎత్తున నగదు లేదు. వైసీపీ ఖాతాలో రూ.29 కోట్లు మాత్రమే ఉన్నాయి. టీడీపీ-రూ.272 కోట్లు, డీఎంకే-రూ.338 కోట్లు, సమాజ్‌వాదీ-రూ.340 కోట్లు, జేడీయూ ఖాతాలో రూ.147 కోట్లు ఉన్నాయి.
Similar News
News November 23, 2024
విమానాలు ఆలస్యమైతే ప్రయాణికులకు ఇవి తప్పనిసరి!
చలికాలంలో పొగమంచు కారణంగా భారీ సంఖ్యలో విమానాలు ఆలస్యంగా నడుస్తాయి. ఆలస్యమైన సమయంలో ప్రయాణికులకు ఉచితంగా ఆహార పదార్థాలు ఇవ్వాలని DGCA విమాన కంపెనీలను ఆదేశించింది. మొదటి 2 గంటల ఆలస్యానికి నీళ్లు, 2-4 గంటల సమయానికి టీ/కాఫీ, 4 గంటల కంటే ఎక్కువ ఆలస్యమైతే మీల్స్ ఉచితంగా ఇవ్వాలంది.
*SHARE IT
News November 23, 2024
ఫలితాల్ని ఊహించలేదు: రాహుల్ గాంధీ
మహారాష్ట్ర ఫలితాల్ని ఊహించలేదని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. ఓటమిపై సమీక్షించుకుంటామని పేర్కొన్నారు. ఝార్ఖండ్‌లో భారీ మెజారిటీ ఇచ్చినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. ఇండియా కూటమి సాధించిన ఈ విజయం రాజ్యాంగ పరిరక్షణతోపాటు సహజ వనరుల పరిరక్షణ విజయంగా అభివర్ణించారు. ఝార్ఖండ్‌లో JMM 28 సీట్లలో గెలిచి మరో 6 చోట్ల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 11 చోట్ల గెలిచి 5 చోట్ల లీడ్‌లో ఉంది.
News November 23, 2024
‘మహాయుతి’కి పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు
మహారాష్ట్రలో ‘మహాయుతి’ మెజార్టీ స్థానాల్లో గెలవడం పట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శుభాకాంక్షలు తెలిపారు. విజనరీ ప్రధాని మోదీ నాయకత్వంపై రాష్ట్ర ప్రజలు నమ్మకం ఉంచారని.. నిజాయితీ, అభివృద్ధికి ఓటేశారని పేర్కొన్నారు. ఫడణవీస్, ఏకనాథ్ శిండే, అజిత్ పవార్ సమష్టిగా పోరాడారని కొనియాడారు. ఎన్డీఏ అభ్యర్థుల తరఫున మహారాష్ట్రలో తాను ప్రచారం చేయడం గౌరవంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు.