News November 23, 2024

వైసీపీకి మరో ఎమ్మెల్సీ గుడ్ బై

image

AP: వైసీపీ ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. ఎమ్మెల్సీ పదవికి, వైసీపీ సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను మండలి ఛైర్మన్‌ మోషేను రాజుకు పంపారు. కాగా కైకలూరుకు చెందిన వెంకటరమణ గతంలో టీడీపీలో పనిచేశారు. గత ఎన్నికలకు ముందు ఆయన వైసీపీలో చేరి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. ఆ ఎన్నికల్లో పార్టీ ఓడిపోవడంతో ఆయన సైలెంట్ అయ్యారు.

Similar News

News November 27, 2024

అదానీపై US కోర్టు కేసులో ఊహించని ట్విస్ట్

image

అదానీపై US డిస్ట్రిక్ట్ కోర్టు కేసులో మరో టర్న్. గౌతమ్ అదానీ, సాగర్ అదానీ, వినీత్ జైన్‌పై US DOJ లంచం, అవినీతి అభియోగాలు నమోదే చేయలేదని అదానీ గ్రూప్ తెలిపింది. ఫారిన్ కరప్షన్, లంచాలపై భారత్, అమెరికా మీడియా చేస్తున్న ప్రచారం అబద్ధమని స్పష్టం చేసింది. మొత్తం 5 అభియోగాల్లో వారిపై మూడే నమోదయ్యాయని తెలిపింది. సెక్యూరిటీస్ ఫ్రాడ్ కుట్ర, వైర్ ఫ్రాడ్ కుట్ర, సెక్యూరిటీ ఫ్రాడ్ ఆరోపణలే ఉన్నాయంది.

News November 27, 2024

క్విక్ కామర్స్.. కిరాణా షాపులకు దెబ్బేనా?

image

10 నిమిషాల్లోపే డెలివరీ చేసే క్విక్ కామర్స్ వ్యాపారం దేశంలో విస్తరిస్తోంది. ఇప్పటికే జొమాటోకు చెందిన బ్లింకిట్, స్విగ్గీకి చెందిన ఇన్‌స్టామార్ట్, జెప్టో, ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన మినట్స్, బిగ్ బాస్కెట్, ఫోన్ పేకి చెందిన పిన్‌కోడ్, జియో మార్ట్ ఉండగా అమెజాన్ కూడా Tez పేరుతో ఈ రంగంలోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఈ క్విక్ కామర్స్ వల్ల కిరాణా షాపులకు ముప్పు కలిగే ఛాన్స్ ఉందని వ్యాపార వర్గాల అంచనా.

News November 27, 2024

STOCK MARKET: ఆటో, ఐటీ షేర్లకు డిమాండ్

image

స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాల్లో కొనసాగుతున్నాయి. గ్లోబల్ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు, నెలవారీ డెరివేటివ్స్ ముగింపు నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉంటున్నారు. సెన్సెక్స్ 80,096 (+90), నిఫ్టీ 24,221 (+25) వద్ద ట్రేడవుతున్నాయి. ఆటో, IT, ఫైనాన్స్ షేర్లకు డిమాండ్ పెరిగింది. O&G, FMCG, బ్యాంకింగ్ రంగాల్లో ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తోంది. INDUSIND, BRITANNIA, CIPLA, AIRTEL, ONGC టాప్ లూజర్స్.