News November 23, 2024
సైకిల్ స్పీడుకు బ్రేకులు వేసిన బీజేపీ
ఉత్తర్‌ప్రదేశ్‌లో 9 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉపఎన్నికలు SP చీఫ్ అఖిలేశ్ యాదవ్‌కు పరాభవాన్ని మిగిల్చాయి. బీజేపీ, దాని మిత్రపక్షం RLD 7 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నాయి. గతంలో అఖిలేశ్ రాజీనామా చేసిన కర్హల్ స్థానంతోపాటు, సిసామౌలో ఎస్పీ లీడింగ్‌లో ఉంది. 2024 లోక్‌సభ ఎన్నికల్లో 37 స్థానాల్లో సొంతంగా గెలిచి జోరుమీదున్న SPకి ఈ ఫలితాలతో బీజేపీ బ్రేకులు వేసినట్టైంది.
Similar News
News November 23, 2024
మహారాష్ట్రలో MIMకు షాక్
మహారాష్ట్రలో 16 సీట్లలో పోటీ చేసిన MIMకు షాక్ తగిలింది. ఔరంగాబాద్ (ఈస్ట్)లో ఎంఐఎం అభ్యర్థి, మాజీ NDTV రిపోర్టర్ ఇంతియాజ్ జలీల్ కేవలం 2వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి అతుల్ సావే విజయం సాధించారు. మాలేగావ్ సెంట్రల్ నియోజకవర్గంలో MIM అభ్యర్థి 75 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆ ఫలితంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా 2019లో MHలో ఎంఐఎం రెండు చోట్ల గెలిచింది.
News November 23, 2024
1.20 లక్షల ఓట్ల మెజార్టీతో శిండే గెలుపు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం ఏక్‌నాథ్ శిండే ఏకంగా 1,20,717 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. కోప్రి-పచ్పఖాడి స్థానం నుంచి పోటీ చేసిన ఆయనకు 1,59,060 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి కేదార్ ప్రకాశ్(శివసేన-UBT) కేవలం 38,343 ఓట్లు సాధించారు. 2009 నుంచి షిండే వరుసగా గెలవడమే కాకుండా మెజార్టీని పెంచుకుంటూ వస్తున్నారు. 2009లో 32,776, 2014లో 51,869, 2019లో 89,300 ఓట్ల మెజార్టీని సాధించారు.
News November 23, 2024
టెన్త్ అర్హత.. 8 నుంచి ‘అగ్నివీర్’ ర్యాలీ
TG: తెలంగాణలోని 33 జిల్లాల అభ్యర్థులకు డిసెంబర్ 8 నుంచి 16 వరకు హైదరాబాద్‌లో అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్టేడియంలో ఫిజికల్ ఈవెంట్స్ ఉంటాయని చెప్పారు. జనరల్ డ్యూటీ, టెక్నికల్, క్లర్క్/స్టోర్ కీపర్ పోస్టులకు టెన్త్ పాసై, 17-21 ఏళ్ల వయసు ఉండాలని సూచించారు. సందేహాలు ఉంటే 040-27740059కు కాల్ చేయొచ్చని పేర్కొన్నారు.