News November 23, 2024

ఆ పార్టీలు కలిసిపోతాయా లేక ఉనికే కోల్పోతాయా?

image

మహారాష్ట్రలో పరాభవం శివసేన UBT, NCP SPకి ప్రాణ సంకటంగా మారింది. ప్రస్తుత రాజకీయాల్లో మ్యాజిక్ ఫిగర్‌కు 5-6 సీట్లతో దూరమైన పార్టీలే ప్రాభవం కోల్పోతున్నాయి. ఆర్థిక వనరుల్లేక చతికిలపడుతున్నాయి. అలాంటిది విడిపోయి బలహీనపడిన పై పార్టీలు ఇప్పుడు ఉనికి కోల్పోయే ప్రమాదంలో పడ్డాయి. ఉద్ధవ్ ఠాక్రేకు వ్యూహరచన, పార్టీని నడపడంలో అనుభవం లేదు. సీనియర్ శరద్ పవార్ రిటైర్మెంట్ ప్రకటించడంతో భవితవ్యం బోధపడటం లేదు.

Similar News

News November 23, 2024

SMATలో షాబాజ్ అహ్మద్ సూపర్ సెంచరీ

image

సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో భాగంగా ఈరోజు పంజాబ్‌vబెంగాల్ మ్యాచ్‌లో బెంగాల్ ప్లేయర్ షాబాజ్ అహ్మద్ అద్భుత ప్రదర్శన చేశారు. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన పంజాబ్ 179 రన్స్ చేయగా ఛేజింగ్‌లో బెంగాల్ 10 రన్స్‌కే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఆ సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన షాబాజ్, 49 బంతుల్లో సెంచరీ చేసి బెంగాల్‌ను విజయ తీరాలకు చేర్చారు. గత ఏడాది IPLలో ఆయన సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు ఆడిన సంగతి తెలిసిందే.

News November 23, 2024

మహారాష్ట్రలో MIMకు షాక్

image

మహారాష్ట్రలో 16 సీట్లలో పోటీ చేసిన MIMకు షాక్ తగిలింది. ఔరంగాబాద్ (ఈస్ట్)లో ఎంఐఎం అభ్యర్థి, మాజీ NDTV రిపోర్టర్ ఇంతియాజ్ జలీల్ కేవలం 2వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. బీజేపీ అభ్యర్థి అతుల్ సావే విజయం సాధించారు. మాలేగావ్ సెంట్రల్ నియోజకవర్గంలో MIM అభ్యర్థి 75 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఆ ఫలితంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా 2019లో MHలో ఎంఐఎం రెండు చోట్ల గెలిచింది.

News November 23, 2024

1.20 లక్షల ఓట్ల మెజార్టీతో శిండే గెలుపు

image

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం ఏక్‌నాథ్ శిండే ఏకంగా 1,20,717 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. కోప్రి-పచ్పఖాడి స్థానం నుంచి పోటీ చేసిన ఆయనకు 1,59,060 ఓట్లు రాగా, సమీప ప్రత్యర్థి కేదార్ ప్రకాశ్‌(శివసేన-UBT) కేవలం 38,343 ఓట్లు సాధించారు. 2009 నుంచి షిండే వరుసగా గెలవడమే కాకుండా మెజార్టీని పెంచుకుంటూ వస్తున్నారు. 2009లో 32,776, 2014లో 51,869, 2019లో 89,300 ఓట్ల మెజార్టీని సాధించారు.