News November 23, 2024
ఎదురుదెబ్బలను తట్టుకుని పీఠమెక్కారు

ఎగ్జిట్‌పోల్స్, విశ్లేషకుల అంచనాలను తలకిందులు చేస్తూ, అనేక ఎదురుదెబ్బలను తట్టుకుని ఝార్ఖండ్‌లో హేమంత్ సోరెన్ నేతృత్వంలోని JMM మరోసారి అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ఏడాదిలో తాను అరెస్టవడం, తర్వాత కీలక నేత చంపై సోరెన్, వదిన సీత కమలం గూటికి చేరినా ఆయన తగ్గలేదు. భార్య కల్పనతో కలిసి సుడిగాలి పర్యటనలు చేశారు. తనపై బీజేపీ చేసిన తీవ్ర ఆరోపణలను ఎండగడుతూనే ప్రజాకర్షక పథకాలతో ఓటర్ల మనసు గెలిచారు.
Similar News
News January 12, 2026
VHT: పడిక్కల్ సరికొత్త చరిత్ర

కర్ణాటక ప్లేయర్ దేవదత్ పడిక్కల్ సరికొత్త చరిత్ర సృష్టించారు. విజయ్ హజారే ట్రోఫీలో రెండు సార్లు 700కు పైగా పరుగులు చేసిన తొలి ప్లేయర్‌గా నిలిచారు. 2021లో 737 రన్స్ చేయగా ప్రస్తుత సీజన్‌లో 721 రన్స్‌తో కొనసాగుతున్నారు. ఈ సీజన్‌లో నాలుగు సెంచరీలు, రెండు అర్ధసెంచరీలు చేశారు. ఓవరాల్‌గా ఈ జాబితాలో తమిళనాడు ప్లేయర్ జగదీశన్(830) ఒక సీజన్‌లో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్‌గా ఉన్నారు.
News January 12, 2026
అగ్నివీర్ వాయు దరఖాస్తులు షురూ

ఎయిర్‌ఫోర్స్‌లో అగ్నివీర్ వాయు నియామకాలకు ఇవాళ్టి నుంచి దరఖాస్తులు మొదలయ్యాయి. అగ్నిపథ్ స్కీమ్‌లో భాగంగా నాలుగేళ్లపాటు ఎయిర్‌ఫోర్స్‌లో సేవలందించేందుకు యువతకు అవకాశం దక్కనుంది. ఫిబ్రవరి 1వ తేదీ 11PM వరకు అప్లై చేసుకునేందుకు గడువుంది. 2006 జనవరి 1-2009 జులై 1 మధ్య పుట్టిన, ఇంటర్/12వ తరగతిలో 50% మార్కులు సాధించిన అవివాహితులు అర్హులు. మరిన్ని వివరాలకు iafrecruitment.edcil.co.in.లో సంప్రదించవచ్చు.
News January 12, 2026
చంద్రబాబు అప్పులు చేస్తే రాష్ట్రం సింగపూర్ అవుతుందా: రాంబాబు

AP: జగన్ హయాంలో ఐదేళ్లలో రాష్ట్రంలో ₹3.32L కోట్ల అప్పులు చేస్తే చంద్రబాబు ఏడాదిన్నరలోనే ₹3.02L కోట్లు అప్పు చేశారని అంబటి రాంబాబు విమర్శించారు. ‘వైసీపీ అప్పులు చేస్తే రాష్ట్రం శ్రీలంక అవుతుంది అన్నారు. చంద్రబాబు అప్పులు చేస్తే సింగపూర్ అవుతుందా? జగన్ చేసిన అప్పుల్లో 90% CBN ఏడాదిన్నరలోనే చేశారు. ఎన్నికల హామీలు ఇప్పటివరకు పూర్తి స్థాయిలో అమలు చేయలేదు’ అని అంబటి ఫైరయ్యారు.


