News November 23, 2024
డే2: భారత్ 172/0
పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ భారీ ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి వికెట్ కోల్పోకుండా 172 రన్స్ చేసింది. మొత్తంగా 218 పరుగుల లీడ్ సాధించింది. యశస్వీ జైస్వాల్(90), కేఎల్ రాహుల్(62) నిలకడగా ఆడుతున్నారు.
Similar News
News November 23, 2024
‘అమరన్’ OTT రిలీజ్ డేట్ ఫిక్స్?
శివ కార్తికేయన్, సాయిపల్లవి జంటగా నటించిన ‘అమరన్’ మూవీ ఈ నెల 29న ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం. మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీ ఇప్పటివరకు దాదాపు రూ.300 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. రాజ్ కుమార్ పెరియస్వామి తెరకెక్కించిన ఈ మూవీకి జీవీ ప్రకాశ్ మ్యూజిక్ అందించారు.
News November 23, 2024
‘అదానీ’ వ్యవహారంపై విచారణ చేయండి: రామకృష్ణ
AP: అదానీ నుంచి రాష్ట్ర నాయకులు, అధికారులు ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. తన ప్రమేయం లేకుండానే విద్యుత్ ఒప్పందాలను క్యాబినెట్‌లో ఆమోదించుకున్నట్లు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారని గుర్తు చేశారు. అదానీతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేసి ప్రజలపై ఛార్జీల భారాన్ని తగ్గించాలని కోరారు.
News November 23, 2024
OFFICIAL: ఝార్ఖండ్ ఫైనల్ రిజల్ట్
ఎగ్జిట్ పోల్ అంచనాలను తలకిందులు చేస్తూ ఝార్ఖండ్‌లో ఇండియా కూటమి ఘన విజయం సాధించింది. JMM ఆధ్వర్యంలోని కూటమి మ్యాజిక్ ఫిగర్ 41 అధిగమించి 56 స్థానాల్లో గెలుపొందింది. జేఎంఎం 34, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 4, CPI ML(L) 2 స్థానాల్లో గెలుపొందాయి. బర్హైత్ నుంచి హేమంత్ సోరెన్ 39,791 ఓట్లతో, గాందే నుంచి కల్పన సోరెన్ 17,142 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. BJP 20 స్థానాల్లో గెలిచి ఒక చోట లీడ్‌లో ఉంది.