News November 23, 2024
చిత్తూరు:అసెస్మెంట్ కార్డులను అందించాలి

పాఠశాలలో విద్యార్థులకు అసెస్మెంట్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. మండల స్థాయిలో ఎంఈఓలు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు. జిల్లా సచివాలయం నుంచి డిఈఓ వరలక్ష్మి సంబంధిత అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాలలకు ఆహ్వానించి అసెస్మెంట్ కార్డులను అందించాలన్నారు.
Similar News
News March 14, 2026
చిత్తూరు: పౌల్ట్రీ రైతులకు కష్టాలు!

చిత్తూరు జిల్లాలో పెద్ద సంఖ్యలో రైతులు పౌల్ట్రీ ఫారాలపై ఆధారపడి జీవిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి వారిని కష్టాలు వీడటం లేదు. జిల్లాలో బర్డ్ ఫ్లూ ప్రభావంతో కొద్దిరోజులు చికెన్ విక్రయాలు తగ్గిపోవడంతో నష్టపోయారు. యుద్ధ ప్రభావంతో కోడిగుడ్ల ఎగుమతులు నిలిచిపోయాయి. వారం రోజుల క్రితం డజన్ కోడిగుడ్ల రిటైల్ ధర రూ.72 ఉండగా ప్రస్తుతం అది రూ.66కు చేరుకుంది.
News March 14, 2026
చిత్తూరు: 108లో ఉద్యోగాలు

చిత్తూరు జిల్లాలో 108 ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్(EMT), పైలట్(Driver) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. విజయవాడలోని గొల్లపూడి ఏరియా మైనార్టీ కమ్యూనిటీ హాల్లో శని ఆదివారం సెలక్షన్స్ నిర్వహిస్తారు. అర్హత, ఆసక్తి ఉన్నవారు ఇంటర్వ్యూకు హాజరు కావాలని జిల్లా మేనేజర్ మోహన్ బాబు, ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ జగదీశ్ కోరారు.
News March 14, 2026
పూతలపట్టు ఎమ్మెల్యేపై కేసు కొట్టివేత

పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్‌పై నమోదైన కేసును చిత్తూరు జిల్లా ఫస్ట్ సెషన్స్ కోర్టు శుక్రవారం కొట్టివేసింది. యాదమరి మండలం కాశిరాళ్ల వద్ద 2023లో ధర్నా నిర్వహించారు. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారనే ఆరోపణలతో యాదమరి పోలీసులు కేసు నమోదు చేశారు. సరైన ఆధారాలు లేకపోవడంతో కోర్టు ఎమ్మెల్యే మురళీమోహన్‌తో పాటు ఇతర నాయకులపై నమోదైన కేసును రద్దు చేసింది.


