News November 23, 2024

60% ముస్లిం ఓట్లు.. 11 మంది ముస్లిం అభ్యర్థులు: భారీ విజయంవైపు BJP

image

UPలోని కుండార్కి బైఎలక్షన్లో BJP రికార్డులు బద్దలుకొట్టనుంది. 30 ఏళ్ల తర్వాత విజయం సాధించబోతోంది. 60% ముస్లిములు ఉండే ఈ సీట్లో BJP అభ్యర్థి రామ్‌వీర్ సింగ్ 19/32 రౌండ్లు ముగిసే సరికి 98,537 ఓట్ల ఆధిక్యంతో దూసుకెళ్తున్నారు. ఆయనకు 1,11,470 ఓట్లు రాగా SP అభ్యర్థి మహ్మద్ రిజ్వాన్‌కు 12,933 ఓట్లే వచ్చాయి. ఈ ఎన్నికల్లో 11 మంది ముస్లిం అభ్యర్థులతో తలపడి రామ్‌వీర్ విజయం సాధించబోతుండటం సంచలనంగా మారింది.

Similar News

News November 23, 2024

‘అదానీ’ వ్యవహారంపై విచారణ చేయండి: రామకృష్ణ

image

AP: అదానీ నుంచి రాష్ట్ర నాయకులు, అధికారులు ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. తన ప్రమేయం లేకుండానే విద్యుత్ ఒప్పందాలను క్యాబినెట్‌లో ఆమోదించుకున్నట్లు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారని గుర్తు చేశారు. అదానీతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేసి ప్రజలపై ఛార్జీల భారాన్ని తగ్గించాలని కోరారు.

News November 23, 2024

OFFICIAL: ఝార్ఖండ్‌ ఫైనల్ రిజల్ట్

image

ఎగ్జిట్ పోల్ అంచ‌నాల‌ను త‌ల‌కిందులు చేస్తూ ఝార్ఖండ్‌లో ఇండియా కూట‌మి ఘ‌న విజ‌యం సాధించింది. JMM ఆధ్వ‌ర్యంలోని కూట‌మి మ్యాజిక్ ఫిగ‌ర్ 41 అధిగ‌మించి 56 స్థానాల్లో గెలుపొందింది. జేఎంఎం 34, కాంగ్రెస్ 16, ఆర్జేడీ 4, CPI ML(L) 2 స్థానాల్లో గెలుపొందాయి. బర్హైత్ నుంచి హేమంత్ సోరెన్ 39,791 ఓట్లతో, గాందే నుంచి క‌ల్ప‌న సోరెన్ 17,142 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. BJP 20 స్థానాల్లో గెలిచి ఒక చోట లీడ్‌లో ఉంది.

News November 23, 2024

పంజాబ్‌లో ఆప్ జోరు.. నాలుగులో 3 గెలుపు

image

పంజాబ్‌లో ఉపఎన్నిక‌లు జరిగిన 4 అసెంబ్లీ సీట్లలో ఆప్ 3 చోట్ల విజ‌యం సాధించి రాష్ట్రంలో ప‌ట్టునిలుపుకుంది. ఇద్ద‌రు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సహా నలుగురు రాజీనామా చేయ‌డంతో ఉపఎన్నిక అనివార్య‌మైంది. డేరా బాబా నానక్, చబ్బేవాల్, గిద్దర్‌బాహా స్థానాల్లో ఆప్, బ‌ర్నాలాలో కాంగ్రెస్ గెలిచాయి. దీంతో ఆప్ బ‌లం అసెంబ్లీలో 94కు చేర‌గా, కాంగ్రెస్ బ‌లం 18 నుంచి 16కి త‌గ్గింది. ప్రజలకు కేజ్రీవాల్ ధన్యవాదాలు తెలిపారు.