News November 23, 2024

పార్లమెంట్‌లో మీ గొంతుకనవుతా: ప్రియాంక

image

వయనాడ్‌లో అఖండ విజయం అందించినందుకు ప్రియాంకా గాంధీ ఆ నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. ‘ప్రియమైన సోదర సోదరీమణులారా, మీరు నాపై ఉంచిన నమ్మకానికి నేను కృతజ్ఞతతో పొంగిపోయాను. నా గెలుపు మీ విజయమని భావిస్తున్నారు అని అనుకుంటున్నా. మీ ఆశలు, కలలను అర్థం చేసుకొని సాకారం చేసేందుకు మీరు ఎంచుకున్న వ్యక్తిగా మీ కోసం పోరాడతా. పార్లమెంట్‌లో మీ గొంతు వినిపించేందుకు ఎదురుచూస్తున్నా’ అని ట్వీట్ చేశారు.

Similar News

News February 19, 2026

ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్‌లో 43 పోస్టులు.. అప్లై చేశారా?

image

ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్‌స్టిట్యూట్ (<>ISI<<>>) కోల్‌కతాలో 43 పోస్టులకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. అర్హతగల వారు FEB 21 వరకు ఆఫ్‌లైన్‌లో అప్లై చేసుకోవచ్చు. సెక్షన్ ఆఫీసర్, ఎలక్ట్రీషియన్, ఇంజినీరింగ్ అసిస్టెంట్ తదితర పోస్టులు ఉన్నాయి. పోస్టును బట్టి పీజీ, డిగ్రీ, AICWA, MBA,డిప్లొమా, ఐటీఐ, టెన్త్, ఇంటర్, ఎనిమిదో తరగతి+ITI అర్హతతో పాటు పని అనుభవం ఉండాలి. వెబ్‌సైట్: www.isical.ac.in

News February 19, 2026

వరి మాగాణి మినుములో ఎండు తెగులు

image

ఎండు తెగులు ఆశించిన మినుము మొక్కలు వడలి, ఎండి పంటకు నష్టం వాటిల్లుతుంది. భూమిలోని శిలీంధ్రం ద్వారా ఈ తెగులు వ్యాపిస్తుంది. దీని నివారణకు పంట మార్పిడితో పాటు పొలంలో నీరు నిల్వలేకుండా చూడాలి. పైరు విత్తే ముందు kg విత్తనానికి 3గ్రా. కార్బెండజిమ్ పట్టించి విత్తాలి. ఎకరాకు 80kgల చివికిన పశువుల ఎరువు+20kgల వేపపిండిలో 2kgల ట్రైకోడెర్మావిరిడె జీవశిలీంధ్రాన్ని కలిపి విత్తే సమయంలో భూమిలో కలియదున్నుకోవాలి.

News February 19, 2026

పూజా సమయంలో చేతికి కంకణం ఎందుకు?

image

ఇందుకు ఆధ్యాత్మిక, ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. పురుషులు కుడి, స్త్రీలు ఎడమచేతికి దీనిని కట్టుకుంటారు. ఇది ధరించడం వల్ల ‘నేను వ్రతం చేస్తున్నాను’ అనే సంకల్పం దృఢపడి మనసు ఏకాగ్రతతో ఉంటుంది. శాస్త్రీయంగా చూస్తే, మణికట్టు వద్ద ఉండే జీవనాడిపై కలిగే ఒత్తిడి వల్ల రక్తప్రసరణ, హృదయస్పందన క్రమబద్ధం అవుతాయి. పసుపు రాసిన నూలుదారం క్రిమిసంహారిణిగా పనిచేస్తుంది. ఆధ్యాత్మిక శక్తిని శరీరంలోకి ప్రసరింపజేస్తుంది.