News November 23, 2024
సీఎం పదవిపై గొడవలు లేవు: ఫడణవీస్

ముఖ్యమంత్రి పదవిపై కూటమిలో ఎలాంటి గొడవలు లేవని, ఈ విషయంలో కూటమి నేతలందరూ చర్చించుకొని నిర్ణయం తీసుకుంటామని దేవేంద్ర ఫడణవీస్ స్పష్టం చేశారు. సీఎం శిండే, ఫడణవీస్, అజిత్ ముగ్గురూ కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ ఫలితాలు ప్రధాని మోదీకి మహారాష్ట్ర ఇస్తున్న మద్దతుకు నిదర్శనమని నేతలు పేర్కొన్నారు. ఒక్కటిగా ఉంటే సురక్షితంగా ఉంటామన్న నినాదానికే ప్రజలు జైకొట్టారన్నారు.
Similar News
News December 25, 2025
పోలవరానికి గోదావరి పుష్కరాలే టార్గెట్: PPA సీఈవో

AP: పోలవరం ప్రాజెక్టును 2027 జూన్ నాటికి పూర్తి చేయాలని PPA సీఈవో యోగేశ్ స్పష్టం చేశారు. పునరావాస గ్రామాల్లో పర్యటించి మౌలిక వసతులు, పరిహారంపై ఆరా తీశారు. అనంతరం ప్రాజెక్టు వద్ద డయాఫ్రంవాల్, బట్రస్ డ్యామ్, కుడి, ఎడమ కాలువ పనులను చూసి సంతృప్తి వ్యక్తం చేశారు. గోదావరి పుష్కరాల నాటికి పనులను పూర్తిచేసే లక్ష్యంతో ప్రణాళికలు రూపొందించుకుని ముందుకెళ్లాలని అధికారులకు సూచించారు.
News December 25, 2025
రోజూ రూ.15 వేలు.. మిరప నుంచే రూ.10 లక్షలు

మొత్తం 20 ఎకరాలకుగాను ఉదయ్ కుమార్ 4 ఎకరాల్లో మిరప, 6 ఎకరాల్లో టమాటా, 1 ఎకరంలో క్యాబేజి, అర ఎకరంలో బఠాణీ పండిస్తున్నారు. మిగిలిన భూమిలో ఆకుకూరలు, కూరగాయలను సాగు చేస్తున్నారు. కేవలం మిరప పంట ద్వారానే ఈ ఏడాది ఇప్పటి వరకు 21 టన్నుల దిగుబడిని సాధించి రూ.10 లక్షలకు పైగా ఆదాయాన్ని పొందారు. ఇలా మిరప సహా ఇతర పంటల నుంచి రోజూ రూ.10వేలు నుంచి రూ.15వేలు ఆదాయం పొందుతూ ఇతర రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు ఉదయ్.
News December 25, 2025
ప్రెగ్నెన్సీలో కింద కూర్చొంటున్నారా?

గర్భం ధరించిన తర్వాత మహిళల శరీరంలో ఎన్నో మార్పులొస్తాయి. ఆ మార్పులను గమనించుకుని తగిన విధంగా జాగ్రత్తలు పాటించాలి. ప్రెగ్నెన్సీలో కింద కూర్చోవాలి అనుకుంటే గర్భాశయం మీద ఒత్తిడి పడకుండా చూసుకోవాలి. బాసింపట్టు వేసుకుని కూర్చునే అలవాటు లేని వాళ్ళు ప్రెగ్నెన్సీ టైమ్ లోప్రయత్నించవద్దు. ఎవరైతే నడుము నొప్పితో బాధపడే ప్రెగ్నెన్సీ మహిళలు ఉంటారో వాళ్ళు బాసింపట్లు వేసుకుని కూర్చోకూడదని నిపుణులు చెబుతున్నారు.


