News November 23, 2024

అభివృద్ధి, సుపరిపాలనలు గెలిచాయి: మోదీ

image

మహారాష్ట్ర ఓటర్లు ఎన్డీయేకి చారిత్రక విజయాన్ని కట్టబెట్టారని ప్రధాని మోదీ ధన్యవాదాలు తెలిపారు. ముఖ్యంగా మహిళలు, యువత తమవైపు నిలబడ్డారని పేర్కొన్నారు. మహారాష్ట్రలో అభివృద్ధి, సుపరిపాలనలు గెలిచాయని అభివర్ణించారు. ఎన్నికల్లో ప్రతిఒక్క ఎన్డీయే కార్యకర్త కష్టపడ్డారని, వారందరికీ థాంక్స్ చెబుతున్నానన్నారు. మరోవైపు ఝార్ఖండ్‌‌లో విజయం సాధించిన JMM కూటమికి మోదీ కంగ్రాట్స్ చెప్పారు.

Similar News

News November 24, 2024

డిసెంబర్ నుంచి ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్

image

తెలంగాణ సచివాలయ ఉద్యోగుల అటెండెన్స్‌ విధానంలో మార్పులు రానున్నాయి. డిసెంబర్ నుంచి ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ అమలు చేయనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. సమయానికి రాని ఉద్యోగులపై ఇటీవల మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ తరహా అటెండెన్స్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ప్రతి ఫ్లోర్‌లోనూ, వివిధ డిపార్ట్‌మెంట్‌ల వద్ద కూడా అటెండెన్స్ మెషీన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.

News November 24, 2024

OFFICIAL: మహారాష్ట్ర ఫలితాలు

image

మహారాష్ట్రలో మహాయుతి కూటమి అఖండ విజయం సాధించింది. మొత్తం 288 అసెంబ్లీ సీట్లకు గాను 233 స్థానాలను సొంతం చేసుకుంది. బీజేపీ 132, శివసేన (SHS) 57, ఎన్సీపీ 41, JSS 2, RSJP 1 సీటు కైవసం చేసుకున్నాయి. అటు మహావికాస్ అఘాడీకి 49 సీట్లు మాత్రమే వచ్చాయి. శివసేన (యూబీటీ) 20, కాంగ్రెస్ 16, ఎన్సీపీ (శరద్) 10, ఎస్పీ 2, PAWPOI 1 సీటు సాధించాయి. ఇతరులకు 6 సీట్లు వచ్చాయి.

News November 23, 2024

28 నుంచి తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు

image

AP: తిరుపతి జిల్లాలోని తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను ఈ నెల 28 నుంచి DEC 6 వరకు నిర్వహించనున్నట్లు TTD వెల్లడించింది. భారీగా తరలివచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. క్యూలో మంచినీరు, అల్పాహారంతో పాటు మ‌రుగుదొడ్ల‌ను కూడా అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది. DEC 6న జరిగే కీలకమైన పంచమి తీర్థ చక్రస్నాన మహోత్సవానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామంది.