News November 23, 2024
ప్రియాంక ఫొటోకు పాలాభిషేకం
TG: వయనాడ్ (కేరళ) ఉపఎన్నికలో ప్రియాంకా గాంధీ భారీ మెజారిటీతో గెలవడంతో తెలంగాణ కాంగ్రెస్ నేతలు సంబరాలు చేసుకున్నారు. మాజీ ఎంపీ వి.హనుమంతరావు, ఇతర నాయకులు గాంధీభవన్‌లో ఆమె చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ప్రియాంక యావత్ భారత దేశంలో తిరిగితే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని వీహెచ్ తెలిపారు. మహారాష్ట్రలో బీజేపీ డబ్బుల ప్రభావంతో గెలిచిందని, అది అంబానీ-అదానీల గెలుపని ఆరోపించారు.
Similar News
News November 23, 2024
28 నుంచి తిరుచానూరు అమ్మవారి బ్రహ్మోత్సవాలు
AP: తిరుపతి జిల్లాలోని తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను ఈ నెల 28 నుంచి DEC 6 వరకు నిర్వహించనున్నట్లు TTD వెల్లడించింది. భారీగా తరలివచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకున్నట్లు తెలిపింది. క్యూలో మంచినీరు, అల్పాహారంతో పాటు మరుగుదొడ్లను కూడా అందుబాటులో ఉంచనున్నట్లు పేర్కొంది. DEC 6న జరిగే కీలకమైన పంచమి తీర్థ చక్రస్నాన మహోత్సవానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశామంది.
News November 23, 2024
హెయిర్ డ్రయ్యర్ పేలి చేతులు కోల్పోయిన మహిళ.. షాకింగ్ ట్విస్ట్
కర్ణాటకలో హెయిర్ డ్రయ్యర్ పేలి ఓ మహిళ 2 చేతులు <<14670361>>కోల్పోయిన<<>> ఘటనలో ట్విస్ట్ చోటుచేసుకుంది. అది హత్యాయత్నమని పోలీసులు తేల్చారు. బసవరాజేశ్వరికి సిద్దప్పతో అఫైర్ ఉంది. పక్కింట్లోని శశికళకు ఈ విషయం తెలిసి రాజేశ్వరిని వారించింది. దీంతో పగ పెంచుకున్న అతను డ్రయ్యర్‌లో డిటోనేటర్‌ను పెట్టి శశికళకు పంపాడు. ఆమె ఇంట్లో లేకపోవడంతో రాజేశ్వరి ఆ పార్సిల్‌ను తీసుకుని బాధితురాలిగా మిగిలింది. నిందితుడు అరెస్టయ్యాడు.
News November 23, 2024
‘గేమ్ ఛేంజర్’ నుంచి స్పెషల్ అప్‌డేట్.. ఎప్పుడంటే..
రామ్ చరణ్ ఫ్యాన్స్ కోసం గేమ్ ఛేంజర్ మూవీ టీమ్ అప్‌డేట్స్ వరద పారిస్తోంది. ఇప్పటికే మూవీలో జరగండి జరగండి, రా మచా మచా పాటలు సూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు మూడో పాట రానుంది. రేపు ఉదయం 11.07 గంటలకు దానికి సంబంధించిన స్పెషల్ అప్‌డేట్ ఇవ్వనున్నట్లు గేమ్ ఛేంజర్ టీమ్ ప్రకటించింది. ‘ది సీజన్ ఆఫ్ లవ్ స్టార్ట్స్ టుమారో’ అన్న క్యాప్షన్‌తో ఇది మెలోడీ సాంగ్ అని ట్విటర్‌లో హింట్ ఇచ్చింది.