News November 23, 2024
తల్లిని కోల్పోయిన పిల్లలను దత్తత తీసుకునే ఉడతలు!
మాతృత్వం ఏ జీవిలోనైనా ఒకేలా ఉంటుందని వర్సిటీ ఆఫ్ గ్వెల్ఫ్ పరిశోధనలో తెలిసింది. అల్బెర్టా విశ్వవిద్యాలయం& మెక్‌గిల్ విశ్వవిద్యాలయ పరిశోధకులతో కలిసి 20 ఏళ్లు పరిశోధన చేసింది. ఆహారం కోసం గొడవకు దిగే ఉడతలు తల్లిని కోల్పోయిన ఉడత పిల్లలను దత్తత తీసుకొని వాటికి తోడుగా ఉంటాయని గుర్తించింది. ముఖ్యంగా ఎర్ర ఉడతలు ఇందుకు ముందుంటాయని వెల్లడైంది. ఇలా ఇతర పిల్లలను తమవాటిలా చూసుకోవడం కూడా అరుదేనని తెలిపింది.
Similar News
News November 24, 2024
కన్నడ సినిమా సక్సెస్ వెనుక యశ్ ఉన్నారు: శివ కార్తికేయన్
‘కేజీఎఫ్’ యశ్ కారణంగా కన్నడ సినిమాకు ప్రపంచవ్యాప్త గుర్తింపు వచ్చిందని తమిళ నటుడు శివకార్తికేయన్ ప్రశంసించారు. గోవాలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ‘కన్నడ చిత్ర పరిశ్రమలో నాకు మొదట తెలిసిన వ్యక్తి శివ రాజ్‌కుమార్. చాలా స్నేహశీలి. కానీ ఆ పరిశ్రమకు యశ్ చేసిన మంచి అంతా ఇంతా కాదు. కేజీఎఫ్-1 వచ్చినప్పుడు ఆ పరిశ్రమ సక్సెస్ అయింది. కానీ కేజీఎఫ్-2తో భారత సినిమా సక్సెస్ అయింది’ అని కొనియాడారు.
News November 24, 2024
డిసెంబర్ నుంచి ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్
తెలంగాణ సచివాలయ ఉద్యోగుల అటెండెన్స్ విధానంలో మార్పులు రానున్నాయి. డిసెంబర్ నుంచి ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ అమలు చేయనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. సమయానికి రాని ఉద్యోగులపై ఇటీవల మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ తరహా అటెండెన్స్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ప్రతి ఫ్లోర్‌లోనూ, వివిధ డిపార్ట్‌మెంట్‌ల వద్ద కూడా అటెండెన్స్ మెషీన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.
News November 24, 2024
OFFICIAL: మహారాష్ట్ర ఫలితాలు
మహారాష్ట్రలో మహాయుతి కూటమి అఖండ విజయం సాధించింది. మొత్తం 288 అసెంబ్లీ సీట్లకు గాను 233 స్థానాలను సొంతం చేసుకుంది. బీజేపీ 132, శివసేన (SHS) 57, ఎన్సీపీ 41, JSS 2, RSJP 1 సీటు కైవసం చేసుకున్నాయి. అటు మహావికాస్ అఘాడీకి 49 సీట్లు మాత్రమే వచ్చాయి. శివసేన (యూబీటీ) 20, కాంగ్రెస్ 16, ఎన్సీపీ (శరద్) 10, ఎస్పీ 2, PAWPOI 1 సీటు సాధించాయి. ఇతరులకు 6 సీట్లు వచ్చాయి.