News November 23, 2024

KMR: దిశ సమావేశంలో పాల్గొన్న MP, MLA

image

అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో అధికారులు సమష్టి సహకారంతో పనిచేయాలని MP సురేశ్ షెట్కార్ అన్నారు. శనివారం దిశ సమావేశంలో ఎమ్మెల్యే KVRతో కలిసి ఆయన పాల్గొన్నారు. 18వ లోక్‌సభ ఏర్పడిన తర్వాత మొదటి దిశ సమావేశం నిర్వహించినట్లు పేర్కొన్నారు. అన్ని శాఖల అధికారుల సహకారంతో ప్రతిపాదించిన లక్ష్యాలను సాధించాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్నారు.

Similar News

News January 8, 2026

NZB: ఈవీఎం గోడౌన్‌‌ను తనిఖీ చేసిన కలెక్టర్

image

నిజామాబాద్ వినాయకనగర్‌లోని ఈవీఎం గోడౌన్‌ను కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ గురువారం సందర్శించారు. సాధారణ పరిశీలన ప్రక్రియలో భాగంగా క్షేత్రస్థాయి సందర్శన జరిపారు. ఈవీఎం గోడౌన్‌కు వేసిన సీళ్లను పరిశీలించారు. గోడౌన్ వద్ద పోలీసు బందోబస్తు తీరును గమనించి పలు సూచనలు చేశారు. కలెక్టర్ వెంట అగ్ని మాపక అధికారి శంకర్ తదితరులు పాల్గొన్నారు.

News January 8, 2026

నిజామాబాద్: బయ్యర్ – సెల్లర్ మీటింగ్‌లో పసుపు బోర్డు ఛైర్మన్

image

మైసూర్‌లో జరిగిన బయ్యర్-సెల్లర్ మీటింగ్‌లో జాతీయ పసుపు బోర్డు ఛైర్మన్ పల్లె గంగారెడ్డి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. రైతుల ఆశలు, ఆశయాలకు కొత్త దిశ చూపిన హృదయస్పర్శి సమావేశంగా నిలిచిందన్నారు. తమ పంటలకు గిట్టుబాటు ధరలు, భవిష్యత్ మార్కెట్ అవకాశాలపై ఆశతో పెద్ద ఎత్తున హాజరైన రైతులు ఈ సమావేశానికి ప్రాణం పోశారని కొనియాడారు.

News January 8, 2026

NZB: 13 కిలోల గంజాయి పట్టివేత.. ఐదుగురి అరెస్ట్

image

నిజామాబాద్ కంఠేశ్వర్ బైపాస్ వద్ద గురువారం నిర్వహించిన తనిఖీల్లో 13 కిలోల గంజాయి పట్టుకుని, ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు ES మల్లారెడ్డి తెలిపారు. ADBకి చెందిన పూజ పవర్, డి.బాయి జాదవ్ లు MP లో గంజాయి కొనుగోలు చేసి MH కు చెందిన కిషన్ మోతిరామ్ దాలే, ఇంద్రజిత్ టాగ్రే లను కలుపుకొని, చద్మల్‌కు చెందిన మంజ వెంకట్రాంకు గంజాయిని ఇస్తుండగా CI స్వప్న ఆధ్వర్యంలో పట్టుకున్నామని వివరించారు.