News November 23, 2024
రాహుల్ రికార్డును బ్రేక్ చేసిన ప్రియాంక.. మెజారిటీ 4,10,931
వయనాడ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి ప్రియాంకా గాంధీ భారీ విజయాన్ని నమోదు చేశారు. గత ఎన్నికల్లో రాహుల్ గాంధీ సాధించిన 3.60 లక్షల మెజారిటీ రికార్డును బ్రేక్ చేసి 4,10,931 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఎల్‌డీఎఫ్ అభ్యర్థి సత్యన్ మోకెరీ రెండో స్థానానికి, బీజేపీ అభ్యర్థి నవ్యా హరిదాస్ మూడో స్థానానికి పరిమితమయ్యారు. విజయం సాధించిన అనంతరం కలిసిన ప్రియాంకకు ఖర్గే శుభాకాంక్షలు తెలిపారు.
Similar News
News November 24, 2024
మోస్ట్ బ్యూటిఫుల్ గ్రౌండ్.. ఎక్కడంటే?
న్యూజిలాండ్‌లోని క్వీన్స్‌టౌన్ మైదానం మోస్ట్ బ్యూటిఫుల్ గ్రౌండ్‌గా మారింది. మంచు కొండల పక్కనే ఉన్న ఈ మైదానం చూపరులను ఆకట్టుకుంటోంది. చుట్టూ ఎలాంటి గోడలు, ఫెన్సింగ్ ఉండవు. స్వేచ్ఛగా మ్యాచ్ వీక్షించవచ్చు. ప్రస్తుతం ఈ స్టేడియంలో ఇంగ్లండ్, న్యూజిలాండ్ XI మధ్య వార్మప్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ సందర్భంగా తీసిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
News November 24, 2024
చెప్పులు లేకుండా నడుస్తున్నారా?
పాదరక్షలు లేకుండా వాకింగ్ చేయడం వల్ల అనేక ప్రయోజనాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ‘పాదాలు నేరుగా నేలను తాకడం వల్ల విశ్రాంతిగా అనిపిస్తుంది. నాణ్యమైన నిద్ర, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఒత్తిడి తగ్గుతుంది. రక్తప్రసరణ మెరుగుపడుతుంది. BP కంట్రోల్‌లో ఉంటుంది. కాలి కండరాలు బలపడతాయి’ అని పేర్కొంటున్నారు. షుగర్ పేషెంట్లు, అరికాళ్ల పగుళ్ల సమస్యలు ఉన్నవారు చెప్పులు లేకుండా నడవొద్దని సూచిస్తున్నారు.
News November 24, 2024
దేశంలోని 19 రాష్ట్రాల్లో NDA ప్రభుత్వాలు
BJP సారథ్యంలోని NDA కూటమి దేశంలోని 28 రాష్ట్రాల్లో 19 చోట్ల ప్రభుత్వ భాగస్వామిగా ఉంది. తమిళనాడు, కేరళ, కర్ణాటక, TG, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, ఝార్ఖండ్, మిజోరం, WBలలో కాంగ్రెస్, ఇతర ప్రాంతీయ పార్టీల ప్రభుత్వాలు నడుస్తున్నాయి. నేడు మహారాష్ట్రలో మహాయుతి ఘన విజయం సాధించిన నేపథ్యంలో NDA పాలించే రాష్ట్రాల మ్యాప్ వైరలవుతోంది. కాంగ్రెస్ స్వతహాగా 3 రాష్ట్రాల్లోనే (TG, HP, KA) ప్రభుత్వంలో ఉంది.