News November 23, 2024

‘అదానీ’ వ్యవహారంపై విచారణ చేయండి: రామకృష్ణ

image

AP: అదానీ నుంచి రాష్ట్ర నాయకులు, అధికారులు ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. తన ప్రమేయం లేకుండానే విద్యుత్ ఒప్పందాలను క్యాబినెట్‌లో ఆమోదించుకున్నట్లు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చెప్పారని గుర్తు చేశారు. అదానీతో చేసుకున్న విద్యుత్ ఒప్పందాలను రద్దు చేసి ప్రజలపై ఛార్జీల భారాన్ని తగ్గించాలని కోరారు.

Similar News

News January 19, 2026

రెవెన్యూ లోటుతో ఉక్కిరిబిక్కిరి

image

మూడేళ్లుగా APని రెవెన్యూ లోటు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. కమిటెడ్ వ్యయం పెరగడం, పన్నేతర ఆదాయం తగ్గడం దీనికి కారణమని కాగ్ నివేదిక పేర్కొంటోంది. FY25-26 NOV నాటికి ₹54355 CR రెవెన్యూ లోటు ఉంది. ఈ లోటు 2024లో ₹56805 CR, 2023లో ₹47063 CRగా ఉంది. దీని భర్తీకి అప్పులు చేయక తప్పడం లేదు. రుణాల్లో 80% శాలరీ, పెన్షన్లు వంటి రెవెన్యూ ఖర్చుకే సరిపోతుండగా క్యాపిటల్ వ్యయం అంతంతే.

News January 19, 2026

రాజకీయ వేధింపులే కాంగ్రెస్ అజెండా: KTR

image

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీశ్ రావుకు <<18900983>>నోటీసులు<<>> జారీ చేయడంపై KTR తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ రాజకీయ వేధింపులకు పాల్పడుతోందని ‘X’ వేదికగా మండిపడ్డారు. ఇందులో పస లేదని సుప్రీంకోర్టే కేసును కొట్టివేసిందని గుర్తు చేశారు. అయినా నోటీసులు ఇవ్వడం ప్రభుత్వ దిగజారుడుకు నిదర్శనమన్నారు. రేవంత్ బావమరిది సుజన్ రెడ్డి బొగ్గు గనుల కుంభకోణాన్ని బయటపెట్టినందుకే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు.

News January 19, 2026

బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు: KTR

image

TG: ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నందుకే హరీశ్ రావును తప్పుడు కేసులతో <<18900983>>ఇబ్బంది<<>> పెడుతున్నారని KTR ఫైర్ అయ్యారు. ‘మాకు చట్టం, న్యాయస్థానాలపై నమ్మకం ఉంది. ఏ విచారణకైనా సిద్ధం. విచారణలు, నోటీసుల పేరుతో ప్రతిపక్షం గొంతు నొక్కాలని చూస్తే అది మీ భ్రమ మాత్రమే. తప్పుడు కేసులు పెట్టినా ప్రజల పక్షాన మిమ్మల్ని వేటాడటం ఆపేది లేదు. ఇలాంటి చౌకబారు బెదిరింపులకు భయపడే ప్రసక్తే లేదు’ అని స్పష్టం చేశారు.