News November 24, 2024

డిసెంబర్ నుంచి ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్

image

తెలంగాణ సచివాలయ ఉద్యోగుల అటెండెన్స్‌ విధానంలో మార్పులు రానున్నాయి. డిసెంబర్ నుంచి ఫేస్ రికగ్నిషన్ అటెండెన్స్ అమలు చేయనున్నట్లు ఉన్నతాధికారులు తెలిపారు. సమయానికి రాని ఉద్యోగులపై ఇటీవల మంత్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఈ తరహా అటెండెన్స్ విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ప్రతి ఫ్లోర్‌లోనూ, వివిధ డిపార్ట్‌మెంట్‌ల వద్ద కూడా అటెండెన్స్ మెషీన్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది.

Similar News

News November 24, 2024

గ్రూప్-4 అభ్యర్థులకు నియామక పత్రాల అందజేత ఎప్పుడంటే?

image

TG: డిసెంబర్ 1 నుంచి 9 రోజుల పాటు నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవాలలో గ్రూప్-4 నియామక పత్రాలు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. వచ్చే నెల పెద్దపల్లిలో నిరుద్యోగ యువతతో విజయోత్సవ సభలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల వెలువడిన తుది ఫలితాల్లో TGPSC 8,084 మంది అభ్యర్థులను పలు పోస్టులకు ఎంపిక చేసింది.

News November 24, 2024

ఈ నెల 29న విశాఖకు ప్రధాని

image

AP: ఈ నెల 29న ప్రధాని మోదీ విశాఖపట్నంకు రానున్నారు. సాయంత్రం ఏయూ మైదానంలో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ఈ క్రమంలో వర్చువల్‌గానే హైడ్రో ప్రాజెక్టుకు, ఫార్మా ఎస్ఈజెడ్‌లో స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లపై సీఎస్ నీరభ్ కుమార్ ఇవాళ, రేపు విశాఖలో సమీక్షించనున్నారు.

News November 24, 2024

రాజ్ థాక్రేకు భంగపాటు

image

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రాజ్ థాక్రేకు చెందిన నవ నిర్మాణ సేన పార్టీ ఘోర పరాజయం పాలైంది. మొత్తం 125 స్థానాల్లో పోటీ చేయగా ఒక్క చోట కూడా విజయం సాధించలేకపోయింది. 2006లో రాజ్ థాక్రే ఈ పార్టీని స్థాపించారు. 2009 అసెంబ్లీలో 13 స్థానాల్లో, 2019 ఎన్నికల్లో ఒక చోట గెలుపొందారు.