News November 24, 2024

చిత్తూరు:అసెస్మెంట్ కార్డులను అందించాలి

image

పాఠశాలలో విద్యార్థులకు అసెస్మెంట్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. మండల స్థాయిలో ఎంఈఓలు, తహశీల్దార్లు, ఎంపీడీవోలు కార్యక్రమాన్ని నిర్వహించాలని ఆదేశించారు. జిల్లా సచివాలయం నుంచి డిఈఓ వరలక్ష్మి సంబంధిత అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యార్థుల తల్లిదండ్రులను పాఠశాలలకు ఆహ్వానించి అసెస్మెంట్ కార్డులను అందించాలన్నారు.

Similar News

News October 31, 2025

ఇంజినీరింగ్ చదివిన చింటూ.. చివరకు!

image

చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో A1 నిందితుడైన, ఉరిశిక్ష పడ్డ చింటూ అలియాస్ చంద్రశేఖర్.. <<18157620>>కఠారి మోహన్‌కు మేనల్లుడు<<>>. ఇంజినీరింగ్ చేసి మంచి ఉద్యోగం చేసే చింటూ మామకోసం ఆయన వెంట నడిచాడు. సీకే బాబుపై 2007లో జరిగిన బాంబ్ బ్లాస్ట్, గన్ ఫైరింగు కేసులో యావజ్జీవ శిక్ష పడినా, తర్వాత బయటకు వచ్చారు. ఆ తర్వాత అన్ని విషయాల్లో తలదూర్చి వ్యక్తిగత, ఆర్ధిక, పవర్ విభేదాలతో మేనమామ దంపతులను హత్య చేశాడు.

News October 30, 2025

బాధిత కుటుంబాలకు చిత్తూరు ఎస్పీ సాయం

image

ప్రమాదాలకు గురైన పోలీసు కుటుంబాలకు చిత్తూరు ఎస్పీ తుషార్ డూడీ గురువారం ఆర్థిక సాయం అందజేశారు. చిత్తూరు తాలూకా పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మురుగేషన్, సాయుధ దళంలో విధులు నిర్వహిస్తున్న రవితేజ నాయక్ ఇటీవల రోడ్డు ప్రమాదాలకు గురయ్యారు. బాధిత కుటుంబ సభ్యులకు IDRF ఫండ్ నుంచి ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున ఎస్పీ చెక్కులను అందజేశారు. కుటుంబాలకు అండగా ఉంటామన్నారు.

News October 30, 2025

తుఫాన్‌ను సీఎం అద్భుతంగా ఎదుర్కొన్నారు: MP

image

చిత్తూరు: మొంథా తుఫాన్‌ను సీఎం చంద్రబాబు అపార అనుభవంతో అద్భుతంగా ఎదుర్కొన్నారని చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు కొనియాడారు. ముందస్తు చర్యలతో ప్రాణనష్టం నివారించగలిగామని తెలిపారు. బాధితులకు సహాయం, పునరావాస కేంద్రాల్లో సౌకర్యాలు కల్పించడం సీఎం చిత్తశుద్ధికి నిదర్శనమన్నారు. ప్రజలకు అండగా నిలిచిన ప్రజాప్రతినిధులు, అధికారులను ఆయన అభినందించారు.