News November 24, 2024
నెతన్యాహుపై అరెస్ట్ వారెంట్‌ని గౌరవిస్తున్నాం: కెనడా
ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు జారీ చేసిన అరెస్ట్ వారెంట్‌ను తాము గౌరవిస్తామని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో స్పష్టం చేశారు. అంతర్జాతీయ చట్టాలకు లోబడే తామెప్పుడూ పనిచేస్తామని పేర్కొన్నారు. ఇప్పటికే యూకే, బెల్జియం, ఐరోపా సమాఖ్య, ఫ్రాన్స్, ఇరాన్, ఐర్లాండ్, జోర్డాన్, నెదర్లాండ్స్, నార్వే, స్వీడన్, దక్షిణాఫ్రికా, స్విట్జర్లాండ్, టర్కీ దేశాలు వారెంట్‌ను అంగీకరించాయి.
Similar News
News November 24, 2024
ఈ నెల 29న విశాఖకు ప్రధాని
AP: ఈ నెల 29న ప్రధాని మోదీ విశాఖపట్నంకు రానున్నారు. సాయంత్రం ఏయూ మైదానంలో జరిగే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. ఈ క్రమంలో వర్చువల్‌గానే హైడ్రో ప్రాజెక్టుకు, ఫార్మా ఎస్ఈజెడ్‌లో స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపనలు చేయనున్నారు. ఈ నేపథ్యంలో పర్యటన ఏర్పాట్లపై సీఎస్ నీరభ్ కుమార్ ఇవాళ, రేపు విశాఖలో సమీక్షించనున్నారు.
News November 24, 2024
రాజ్ థాక్రేకు భంగపాటు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో రాజ్ థాక్రేకు చెందిన నవ నిర్మాణ సేన పార్టీ ఘోర పరాజయం పాలైంది. మొత్తం 125 స్థానాల్లో పోటీ చేయగా ఒక్క చోట కూడా విజయం సాధించలేకపోయింది. 2006లో రాజ్ థాక్రే ఈ పార్టీని స్థాపించారు. 2009 అసెంబ్లీలో 13 స్థానాల్లో, 2019 ఎన్నికల్లో ఒక చోట గెలుపొందారు.
News November 24, 2024
111 కోట్ల జీరో టికెట్లు జారీ: మంత్రి పొన్నం
TG: తమ ప్రభుత్వం ఆర్టీసీలో తీసుకొచ్చిన ‘మహాలక్ష్మీ’ పథకం ద్వారా మహిళలు రూ.3,747 కోట్లు ఆదా చేసుకున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. డిసెంబర్ నుంచి ఈ నెల 20 వరకు 111 కోట్ల జీరో టికెట్లు జారీ చేసినట్లు తెలిపారు. పథకం అమలు తర్వాత ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో 94 శాతానికి చేరిందని చెప్పారు. తాము అధికారంలోకి వచ్చాక TGSRTC ప్రభుత్వ సహకారంతో 1,389 కొత్త బస్సులను కొనుగోలు చేసిందని పేర్కొన్నారు.