News November 24, 2024
IPL: మెగా వేలానికి వేళాయే

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సమయం రానే వచ్చింది. ఇవాళ, రేపు మధ్యాహ్నం 3.30 గంటల నుంచి సౌదీ అరేబియాలోని జెడ్డాలో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది.
* మొత్తం స్లాట్స్: 204 * వేలంలో పాల్గొనేవారి సంఖ్య: 577
* భారత ప్లేయర్లు: 367 మంది * విదేశీ ప్లేయర్లు: 210 మంది
* అత్యంత పెద్ద వయస్కుడు: అండర్సన్(ENG)
* పిన్న వయస్కుడు: వైభవ్ సూర్యవంశి(బిహార్)
* లైవ్: స్టార్ స్పోర్ట్స్, జియో సినిమా యాప్, IPL వెబ్‌సైట్
Similar News
News January 31, 2026
వారసుడి కోసం కాదు.. వారసురాలే కావాలట!

ఒకప్పుడు కొడుకు పుడితేనే పండగ.. కానీ నేడు ఆ ఆలోచన మారింది. ప్రపంచవ్యాప్తంగా తల్లిదండ్రులు అమ్మాయిలకే ప్రాధాన్యం ఇస్తున్నారని తాజా అధ్యయనంలో తేలింది. అమ్మాయిలు ఎంతో ప్రేమగా ఉంటూ భావోద్వేగాలను పంచుకోవడం, వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు ఆసరాగా నిలవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. అబ్బాయిలు నేరాల బాట పట్టే అవకాశం ఎక్కువగా ఉండటం వల్ల వారి పట్ల ఆందోళన పెరుగుతోంది. మీకూ ఇదే ఫీలింగ్ ఉందా? COMMENT
News January 31, 2026
NCPల విలీనంపై సందిగ్ధత ఏర్పడింది: శరద్ పవార్

విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణంతో NCPల విలీనంపై సందిగ్ధత ఏర్పడిందని NCP వ్యవస్థాపకుడు శరద్ పవార్ అన్నారు. అజిత్, MLA జయంత్ పాటిల్ మధ్య జరగాల్సిన చర్చలు నిలిచిపోయాయని తెలిపారు. ఫిబ్రవరి 12 డెడ్‌లైన్‌గా అజిత్ చర్చలు జరిపారని, ప్రస్తుతం ఆయన శిబిరంలోని నాయకులు విలీనానికి ఆసక్తిగా లేరన్నారు. ఈరోజు సా.5 గంటలకు సునేత్రా పవార్ డిప్యూటీ CMగా ప్రమాణం చేస్తున్నందున ఈ కామెంట్లు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
News January 31, 2026
ఇజ్రాయెల్ వలలో ట్రంప్.. ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో దిమ్మతిరిగే నిజాలు!

ఎప్‌స్టీన్ తాజా ఫైల్స్ సంచలనం రేపుతున్నాయి. ఇజ్రాయెల్ వలలో ట్రంప్ చిక్కుకున్నారని, ఆయన నిర్ణయాలపై ఆ దేశ ప్రభావం బలంగా ఉందని ఈ ఫైల్స్ వెల్లడించాయి. రష్యా పెట్టుబడులు, ఇజ్రాయెల్ అనుకూల నెట్‌వర్క్స్‌తో ట్రంప్ అల్లుడు కుష్నర్‌కు సంబంధాలు ఉండడంతో వైట్ హౌస్ నిర్ణయాలను ప్రభావితం చేశారని ఆరోపించాయి. ఇజ్రాయెల్ గూఢచార సంస్థ Mossad కోసం ఎప్‌స్టీన్ లాయర్ పనిచేశారని ఈ రిపోర్ట్ పేర్కొనడం సంచలనంగా మారింది.


