News November 24, 2024
గ్రూప్-4 అభ్యర్థులకు నియామక పత్రాల అందజేత ఎప్పుడంటే?

TG: డిసెంబర్ 1 నుంచి 9 రోజుల పాటు నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవాలలో గ్రూప్-4 నియామక పత్రాలు ఇవ్వాలని సీఎం నిర్ణయించారు. వచ్చే నెల పెద్దపల్లిలో నిరుద్యోగ యువతతో విజయోత్సవ సభలో ఎంపికైన అభ్యర్థులకు నియామక పత్రాలు అందజేసేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల వెలువడిన తుది ఫలితాల్లో TGPSC 8,084 మంది అభ్యర్థులను పలు పోస్టులకు ఎంపిక చేసింది.
Similar News
News February 3, 2026
ధనుష్, సాయి పల్లవి జోడీగా మరో సినిమా

‘మారి 2’ సినిమాతో మెరిసిన ధనుష్, సాయి పల్లవి జోడీ మరోసారి వెండితెరపై సందడి చేయనున్నారు. అమరన్ మూవీతో సత్తాచాటిన రాజ్ కుమార్ పెరియస్వామి దర్శకత్వంలో ఈ జంట నటించనుంది. హీరో ధనుష్‌కు ఇది 55వ చిత్రం. ఈ సినిమాలో ఇప్పటికే హీరోయిన్‌గా శ్రీలీల ఎంపిక కాగా.. మరో కథానాయికగా సాయి పల్లవిని సెలక్ట్ చేశారు. వాస్తవ సంఘటనల ఆధారంగా, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కుతున్నట్లు సమాచారం.
News February 3, 2026
ఇండియన్ టెక్నాలజీతోనే హైస్పీడ్ రైళ్లు: నిర్మలా సీతారామన్

దేశంలో రాబోయే హైస్పీడ్ రైలు నెట్‌వర్క్ పూర్తిగా దేశీయ టెక్నాలజీతోనే సాగుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. ఈ బుల్లెట్ తరహా రైళ్లు ఇండియన్ టెక్నాలజీతో, మేడ్ ఇన్ ఇండియా కోచ్‌లతోనే పట్టాలెక్కుతాయని బడ్జెట్ తర్వాత ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ముంబై-పుణే, పుణే-హైదరాబాద్, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-చెన్నై సహా మొత్తం 7 కారిడార్లను బడ్జెట్‌లో ప్రతిపాదించిన విషయం తెలిసిందే.
News February 3, 2026
బలహీన పోలింగ్ బూత్‌లపై TDP ప్రత్యేక దృష్టి

AP: అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి ఓట్లు బాగా తగ్గిన పోలింగ్ బూత్‌లపై TDP ప్రత్యేక దృష్టి సారించింది. ఇలాంటి బూత్‌లు 4500 ఉన్నట్లు గుర్తించి వాటిపై సర్వే చేయించింది. వివిధ పదవులు పొందిన 1000 మంది నాయకులతో ఈ సర్వే పూర్తి చేసింది. వీటిలో ఉన్న లోపాలపై నివేదికలను రప్పించింది. స్థానిక సంస్థల ఎన్నికలకు SEC కసరత్తు చేపట్టిన నేపథ్యంలో అంతకు ముందుగా ఈ బూత్‌లలో పార్టీని పటిష్ఠం చేసేలా శిక్షణకు నిర్ణయించింది.


