News November 24, 2024
స్టార్క్ బెదిరింపులపై రాణా ఏమన్నారంటే?
తొలి టెస్టులో ఆస్ట్రేలియన్ ప్లేయర్ స్టార్క్‌తో <<14684131>>సరదా సంభాషణ<<>> జరిగిందని బౌలర్ హర్షిత్ రాణా చెప్పారు. మైదానంలో ఇలాంటివి జరుగుతుంటాయని, ఇది పెద్ద విషయం కాదన్నారు. హెడ్‌ను ఔట్ చేయడంపై జట్టు ఆటగాళ్లతో చర్చించుకున్నట్లు తెలిపారు. ఒక ఎండ్ నుంచి బ్యాటర్లపై బుమ్రా ఒత్తిడి పెంచి మరో ఎండ్‌లోని బౌలర్ పనిని సులభం చేస్తారని పేర్కొన్నారు. కాగా తొలి ఇన్నింగ్సులో హర్షిత్ 3 వికెట్లు తీశారు.
Similar News
News November 24, 2024
పోలీసులు ఎక్కడ పడితే అక్కడ చేతులేశారు: లగచర్ల మహిళలు
TG: <<14585618>>లగచర్లలో<<>> NHRC బృందం పర్యటించి బాధితులతో మాట్లాడింది. ఈ ఘటన జరిగిన రోజు(Nov 11) రాత్రి కరెంట్ తీసేసి తమ ఇళ్లలోకి పోలీసులు దూరి మగవాళ్లను తీసుకెళ్లారని మహిళలు NHRC అధికారులకు చెప్పారు. భర్తలను తీసుకెళ్లవద్దని అడ్డుపడిన తమపై ఎక్కడపడితే అక్కడ చేతులు వేశారన్నారు. అసభ్యంగా తిట్టారని వివరించారు. డెలివరీ చేయించుకోవాలని బతిమాలినా వినలేదని ఓ గర్భిణీ ఆవేదన వ్యక్తం చేసింది.
News November 24, 2024
గవాస్కర్ సరసన యశస్వీ జైస్వాల్
ఆసీస్‌తో తొలి టెస్టులో సెంచరీ బాది టీమ్ ఇండియా బ్యాటర్ యశస్వీ జైస్వాల్ రికార్డులు సాధించారు. 23 ఏళ్లకే టెస్టుల్లో అత్యధిక సెంచరీలు బాదిన ఐదో భారత బ్యాటర్‌గా ఆయన నిలిచారు. ఇప్పటివరకు జైస్వాల్ 4 సెంచరీలు బాదారు. ఈ క్రమంలో గవాస్కర్ (4) రికార్డును సమం చేశారు. అలాగే 23 ఏళ్లకే ఒకే క్యాలెండర్ ఇయర్‌లో 3 సెంచరీలు బాదిన ఐదో భారత క్రికెటర్‌గానూ నిలిచారు. గవాస్కర్, కాంబ్లీ ఒకే ఏడాదిలో 4 సెంచరీలు చేశారు.
News November 24, 2024
నేతలకు కలిసొస్తున్న ‘జైలు’ సెంటిమెంట్!
ఝార్ఖండ్ JMM చీఫ్ హేమంత్ సోరెన్ అవినీతి ఆరోపణలతో జైలుకు వెళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎన్నికలు జరగగా రాష్ట్ర ప్రజలు మరోసారి ఆయనకే అధికారం కట్టబెట్టారు. గత పదేళ్లలో జగన్, CBN, రేవంత్ వంటి నేతలూ జైలుకు వెళ్లి వచ్చాక CM అయ్యారు. దీంతో ఈ సెంటిమెంట్ నేతలకు కలిసి వస్తోందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. త్వరలో ఢిల్లీ ఎన్నికలు జరగనుండగా కేజ్రీవాల్ విషయంలోనూ ఇదే రిపీట్ అవుతుందంటున్నారు.