News November 24, 2024
వాయుగుండం.. మూడు రోజులు భారీ వర్షాలు
AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం రేపు వాయుగుండంగా మారే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఈ నెల 27, 28, 29న దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని పేర్కొంది. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
Similar News
News November 24, 2024
యశస్వీ జైస్వాల్ స్పెషల్ ఇన్నింగ్స్‌కు తెర
ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ ఇండియా ఓపెనర్ యశస్వీ జైస్వాల్ (161) ఔటయ్యారు. మిచెల్ మార్ష్ బౌలింగ్‌లో స్మిత్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరారు. కాగా జైస్వాల్ అద్భుత ఇన్నింగ్స్ ఆడడంతో ప్రేక్షకులు, ఆటగాళ్లు స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చారు. కాగా భారత్ స్కోర్ ప్రస్తుతం 314/3గా ఉంది. క్రీజులో విరాట్ కోహ్లీ (17*), రిషభ్ పంత్ (0*) ఉన్నారు.
News November 24, 2024
బిగ్‌బాస్ నుంచి యష్మీ ఎలిమినేట్?
బిగ్‌బాస్ సీజన్-8 చివరి దశకు చేరింది. దీంతో టాప్-5లో ఎవరు నిలుస్తారు? విజేత ఎవరవుతారనే ఆసక్తి పెరుగుతోంది. ఈవారం నామినేషన్స్‌లో నిఖిల్, పృథ్వీ, ప్రేరణ, యష్మీ, నబీల్ ఉన్నారు. అయితే నిఖిల్, ప్రేరణ, నబీల్ సేవ్ కాగా యష్మీ, పృథ్వీ చివరి రెండు స్థానాల్లో నిలిచారు. వీరిద్దరిలో యష్మీ ఎలిమినేట్ అయ్యారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన షూట్ నిన్నే పూర్తి కాగా ఇవాళ ఎపిసోడ్ టెలికాస్ట్ కానుంది.
News November 24, 2024
ముస్లిం ఏరియాలో BJP విజయం.. కారణమిదే!
దేశమంతా మహారాష్ట్ర, ఝార్ఖండ్ ఎన్నికల గురించి మాట్లాడుతుంటే UPలో మాత్రం కుందర్కీ నియోజకవర్గం హాట్ టాపిక్‌గా మారింది. 61% ఓట్లున్న ఈ స్థానంలో 31ఏళ్ల తర్వాత BJP అభ్యర్థి రాంవీర్ సింగ్ 1,44,791 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక్కడ మొత్తం 12 మంది పోటీ చేస్తే అందులో 11 మంది ముస్లింలుండటం గమనార్హం. కాగా గత MLAపై అసంతృప్తి, కమ్యూనిటీలో అంతర్గత కలహాలు, ఓట్ల చీలికల వల్ల రాంవీర్‌కు విజయం దక్కిందని తెలుస్తోంది.