News November 24, 2024

CM కుర్చీ కోసం ‘ముగ్గురు మొనగాళ్లు’

image

మహారాష్ట్రలో BJP నేతృత్వంలోని మహాయుతికి 230 సీట్లతో స్పష్టమైన మెజారిటీ వచ్చింది. కూటమిలోని BJP 149 స్థానాల్లో పోటీ చేయగా 132 గెలిచింది. శివసేన 81లో 57, NCP 59లో 41 గెలిచింది. కాగా తమ నేత ఫడణవీస్‌ CM కావడం పక్కా అని BJP అంటుంటే, శిండే నేతృత్వంలోని శివసేన సైతం CM విషయంలో తగ్గేదేలే అంటోంది. అటు NCP అజిత్ పవార్‌ కూడా CM కుర్చీ త్యాగం చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు కనిపించట్లేదు.

Similar News

News January 14, 2026

పాలిటెక్నిక్‌లో కొత్త కోర్సులు!

image

TG: విద్యార్థులకు ఉపాధి కల్పనే లక్ష్యంగా పాలిటెక్నిక్‌లో 2026-27 విద్యాసంవత్సరం నుంచి 9 కొత్త కోర్సులు రానున్నాయి. దీనికి అనుగుణంగా కొత్త సిలబస్ రానున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై AICTE అనుమతుల కోసం రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీ దేవసేన ఢిల్లీకి వెళ్లారు. వీటితో పాటు మొదటి సంవత్సరంలో సెమిస్టర్‌కు బదులుగా వార్షిక పరీక్ష విధానం అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

News January 14, 2026

పాలిటెక్నిక్‌లో కొత్త కోర్సులు ఇవే..

image

1)సెమీకండక్టర్స్ టెక్నాలజీ,
2)సివిల్ ఇంజినీరింగ్ అండ్ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ వాల్యుయేషన్
3)ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ అండ్ ఇంజినీరింగ్
4)ల్యాండ్ స్కేప్ డిజైన్, 5)బయోటెక్నాలజీ
6)కన్‌స్ట్రక్షన్ టెక్నాలజీ అండ్ మేనేజ్‌మెంట్
7)సివిల్ ఇంజినీరింగ్ అండ్ బిల్డింగ్ సర్వీసెస్
8)ఎలక్ట్రానిక్స్ అండ్ కంప్యూటర్ ఇంజినీరింగ్
9)అడ్వాన్స్డ్ మాన్యుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ

News January 14, 2026

రేపు భోగి.. ఏం చేస్తారంటే?

image

తెలుగు ప్రజలకు అతిపెద్ద పండుగల్లో సంక్రాంతి ఒకటి. మూడు రోజులు జరుపుకునే ఈ పండుగలో తొలి రోజును భోగిగా పిలుస్తారు. ఈ రోజు తెల్లవారుజామునే నిద్రలేచి పనికి రాని, పాత చెక్కవస్తువులతో భోగి మంటలు వేస్తారు. ఇంటి ముందు ముగ్గులు వేయడంతో పాటు ఇంటిని శుద్ధి చేసి పిండి వంటలు చేసుకొని తింటారు. దానం చేస్తారు. సాయంత్రం చిన్నారులకు భోగి పళ్లను పోస్తారు. కొందరు తమ ఇళ్లలో బొమ్మల కొలువులు ఏర్పాటు చేస్తారు.