News November 24, 2024

వర్కౌట్ కాని BJP ‘బంటీ ఔర్ బబ్లీ’ అస్త్రం!

image

ఝార్ఖండ్‌లో సీఎం హేమంత్ సోరెన్, ఆయన సతీమణి కల్పనా సోరెన్‌ను ఉద్దేశిస్తూ ఎన్నికల ప్రచారంలో BJP ‘బంటీ ఔర్ బబ్లీ’ అని సెటైర్లు వేసింది. అవినీతి ఆరోపణల నేపథ్యంలో సోరెన్ జైలుకెళ్లడంతో ఇద్దరూ ‘తోడు దొంగలు’ అనే అర్థం వచ్చేలా BJP పదేపదే ఈ కామెంట్స్ చేస్తూ వచ్చింది. ‘బంటీ ఔర్ బబ్లీ’ అనేది బాలీవుడ్ సినిమా టైటిల్. అయితే BJP ప్రయోగించిన ఈ అస్త్రం ఫలించలేదు. సోరెన్ పార్టీ JMM ఘన విజయం సాధించింది.

Similar News

News November 28, 2024

O పాజిటివ్ బదులు AB పాజిటివ్ రక్తం ఎక్కించారు.. చివరికి

image

AP: వైద్యుల నిర్లక్ష్యం ఓ వివాహిత ప్రాణం తీసింది. పాలకొల్లుకు చెందిన శిరీష(34) అస్వస్థతకు గురికావడంతో డయాలసిస్ కోసమని కాకినాడ GGHలో చేర్చారు. మొన్న రక్తం ఎక్కించగా కాసేపటికే ఆమె పరిస్థితి విషమించింది. O పాజిటివ్ బదులు AB పాజిటివ్ గ్రూపు రక్తం ఎక్కించామని వైద్యులు గ్రహించారు. ఆరోగ్యం క్షీణించడంతో ఆమె నిన్న మరణించింది. మృతురాలి కుటుంబానికి ప్రభుత్వ పరంగా రూ.3 లక్షల చెక్కును పరిహారంగా అందించారు.

News November 28, 2024

నేటి నుంచి ‘రైతు పండుగ’

image

TG: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తి కావొస్తున్న నేపథ్యంలో నేటి నుంచి మూడు రోజుల పాటు మహబూబ్‌నగర్‌లో ‘రైతు పండుగ’ నిర్వహించనుంది. దీనిలో ఆధునిక వ్యవసాయ పద్ధతులు, లాభసాటి విధానాలు, వివిధ పంట ఉత్పత్తులపై రైతులకు అవగాహన కల్పించే కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ మేరకు 150 స్టాళ్లను ఏర్పాటు చేయనుండగా వ్యవసాయ శాస్త్రవేత్తలు హాజరుకానున్నారు. ఈ నెల 30న సీఎం రేవంత్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు.

News November 28, 2024

మధ్యాహ్నం భోజనం ధరల పెంపు

image

మధ్యాహ్న భోజన పథకం ధరలను పెంచుతూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం ప్రాథమిక పాఠశాలల్లో చదివే ఒక్కో విద్యార్థికి రూ.5.45 చొప్పున ఇస్తుండగా దానిని రూ.6.19కి పెంచింది. హైస్కూళ్లలో చదివే వారికి 8.17 చొప్పున చెల్లిస్తుండగా రూ.9.29కి పెంచింది. పెంచిన ధరలను డిసెంబర్ 1 నుంచి అమలు చేయనున్నారు. ఈ ఖర్చులో కేంద్రం 60శాతం, రాష్ట్ర ప్రభుత్వం 40శాతం నిధులు భరించనున్నాయి.