News November 24, 2024

రేపటి నుంచి పార్లమెంట్ వింటర్ సెషన్

image

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. డిసెంబర్ 20 వరకు కొనసాగుతాయి. ఈ సమావేశాల్లో వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు సహా 15 కీలక బిల్లులను కేంద్రం సభలో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వాటిపై చర్చించి ఆమోదించనుంది. సమావేశాల నేపథ్యంలో ఇవాళ అఖిలపక్ష భేటీ జరగనుంది. మరోవైపు పార్లమెంట్ పాత భవనంలోని సంవిధాన్ సదన్ సెంట్రల్ హాల్‌లో 75వ రాజ్యాంగ దినోత్సవాన్ని నిర్వహించాలని కేంద్రం నిర్ణయించింది.

Similar News

News November 24, 2024

విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ

image

పెర్త్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్టులో టీమ్ ఇండియా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ (52) హాఫ్ సెంచరీ చేశారు. 3 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో ఆయన ఫిఫ్టీ పూర్తి చేసుకున్నారు. కాగా 13 ఇన్నింగ్స్‌ల తర్వాత విరాట్ అర్ధ సెంచరీ చేయడం విశేషం. ప్రస్తుతం భారత్ స్కోర్ 384/5గా ఉంది. క్రీజులో కోహ్లీతోపాటు వాషింగ్టన్ సుందర్ (18*) ఉన్నారు.

News November 24, 2024

నేనూ NCC క్యాడెట్‌నే: PM మోదీ

image

తాను కూడా NCC క్యాడెట్ అని ప్ర‌ధాని మోదీ తెలిపారు. ఆదివారం NCC దినోత్సవం సంద‌ర్భంగా ఈ అంశాన్ని ఆయ‌న మ‌న్ కీ బాత్‌లో ప్ర‌స్తావించారు. ‘ఈరోజు చాలా ప్రత్యేకమైనది. నేడు NCC దినోత్సవం. ఈ పేరు వినగానే మనకు స్కూల్, కాలేజీ రోజులు గుర్తుకొస్తాయి. నేనూ NCC క్యాడెట్‌నే. NCCలో అనుభవం నాకు అమూల్యమైనదని పూర్తి విశ్వాసంతో చెప్పగలను. NCC యువతలో క్రమశిక్షణ, నాయకత్వం, సేవా భావాన్ని పెంపొందిస్తుంద’ని పేర్కొన్నారు.

News November 24, 2024

విద్యార్థుల జీవితాలతో సర్కార్ చెలగాటం: జగన్

image

AP: ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించకుండా కూటమి సర్కార్ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతోందని మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. విద్యార్థులపై చంద్రబాబు కక్షగట్టారని ఆయన విమర్శించారు. ‘అమ్మఒడి, ఇంగ్లిష్ మీడియం, టోఫెల్, ట్యాబులు, బైజూస్ కంటెంట్, నాడు-నేడును బాబు రద్దు చేశాడు. వైసీపీ హయాంలో తల్లుల ఖాతాలకే వసతి, విద్యా దీవెన జమ చేసేవాళ్లం. ఇప్పుడు అది కూడా లేకుండాపోయింది’ అని ఆయన ఫైర్ అయ్యారు.