News November 24, 2024
సీజనల్ ఫీవర్స్‌పై ప్రభుత్వం ఫోకస్

AP: రాష్ట్రంలో చలి తీవ్రత పెరగడంతో సీజనల్ ఫీవర్స్, ఫుడ్ పాయిజనింగ్‌పై ప్రభుత్వం అప్రమత్తమైంది. అన్ని జిల్లాలకు అలర్ట్ జారీ చేసింది. పీహెచ్‌సీలకు ఫీవర్ ఎమర్జెన్సీ కిట్స్‌ను తరలించింది. కలుషిత నీటిపై అధికారులు ఫోకస్ పెట్టాలని, ఎప్పటికప్పుడు శాంపిల్స్ సేకరించి పరీక్షలు నిర్వహించాలని ఆదేశించింది. ప్రజలు కాచి చల్లార్చిన నీటినే తాగాలని సూచించింది.
Similar News
News November 13, 2025
టుడే..

* ఢిల్లీలో ఇండో-యూఎస్ సమ్మిట్ ప్రతినిధులతో భేటీ కానున్న సీఎం రేవంత్.. అనంతరం పార్టీ పెద్దలతో సమావేశం
* AP: ఎస్సీ, ఎస్టీలకు ఉచిత యూపీఎస్సీ కోచింగ్.. నేటి నుంచి 16వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ
* విశాఖలో వరల్డ్ ట్రేడ్ సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన
* రుషికొండ ఐటీ పార్కులో ఫెనోమ్ క్యాంపస్‌కు శంకుస్థాపన చేయనున్న మంత్రి లోకేశ్
News November 13, 2025
పాల వ్యాపారం.. ఏడాదిలో రూ.2 కోట్ల ఆదాయం

పాల వ్యాపారంలో అద్భుతంగా రాణిస్తున్నారు గుజరాత్‌లోని బనస్కాంతకు చెందిన 65 ఏళ్ల మణిబెన్. ఆమె 2011లో 12 ఆవులతో డెయిరీ ఫామ్ ప్రారంభించారు. ప్రస్తుతం ఫామ్‌లో 230 ఆవులు, బర్రెలున్నాయి. మెషిన్లతో పాలను తీస్తూ రోజూ 1100 లీటర్లను గ్రామ కోఆపరేటివ్ డెయిరీకి సరఫరా చేస్తున్నారు. ఇలా 2024-25లో 3.47లక్షల లీటర్ల పాలను అమ్మి రూ.1.94 కోట్ల ఆదాయం పొందారు.✍️ మరింత సమాచారానికి <<-se_10015>>పాడిపంట<<>> కేటగిరీ క్లిక్ చేయండి.
News November 13, 2025
వచ్చే ఏడాది రూ.3 కోట్ల ఆదాయం లక్ష్యం

పాడి పశువుల పోషణలో మణిబెన్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వాటికి మేలైన పచ్చగడ్డి, దాణా అందిస్తున్నారు. ఒక పశువు నుంచి మెషిన్ సాయంతో 9-14 లీటర్ల పాలను తీస్తున్నారు. 16 కుటుంబాలకు జీవనోపాధి కల్పిస్తున్నారు. ప్రస్తుతం వీరి దగ్గర 140 పెద్ద గేదెలు, 90 ఆవులు, 70 దూడలున్నాయి. మరో 100 గేదెలను కొనుగోలు చేసి, డెయిరీ ఫామ్‌ను విస్తరించి వచ్చే ఏడాది 3 కోట్ల వ్యాపారం చేయాలని మణిబెన్ లక్ష్యంగా పెట్టుకున్నారు.


